వందేభారత్‌కు ఘన స్వాగతం

ABN , First Publish Date - 2023-01-17T01:10:28+05:30 IST

రైల్వేశాఖ కొత్తగా అందుబాటులోకి తెచ్చిన సెమీ హైస్పీడ్‌ వందే భారత్‌ రైలును చూసేందుకు నూజివీడు స్టేషన్‌లో ప్రజానీకం ఆసక్తి కనబరిచారు. అధిక సంఖ్యలో రైలును చూడడానికి తరలివచ్చారు.సంక్రాంతి రోజున ప్రధాని మోదీ వర్చువల్‌లో సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి వందే భారత్‌ రైలును లాంచ్‌ చేశారు.

 వందేభారత్‌కు ఘన స్వాగతం

హనుమాన్‌జంక్షన్‌, జనవరి 16 : రైల్వేశాఖ కొత్తగా అందుబాటులోకి తెచ్చిన సెమీ హైస్పీడ్‌ వందే భారత్‌ రైలును చూసేందుకు నూజివీడు స్టేషన్‌లో ప్రజానీకం ఆసక్తి కనబరిచారు. అధిక సంఖ్యలో రైలును చూడడానికి తరలివచ్చారు.సంక్రాంతి రోజున ప్రధాని మోదీ వర్చువల్‌లో సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి వందే భారత్‌ రైలును లాంచ్‌ చేశారు. ఆ రైలు నూజివీడు స్టేషన్‌ మీదుగా ఆదివారం సాయంత్రం విశాఖపట్నం వెళ్లింది. నూజివీడుస్టేషన్‌లో ఒక నిమిషం ఆగింది. ఈ సందర్భంగా నూజివీడు స్టేషన్‌ అభివృద్ధి కమిటీ చైర్మన్‌ అట్లూరి రమేష్‌, బీజేపీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గత్త్తికొండ శ్రీరాజబాబు, పంతం గజేంద్ర, బీజేపీ, జనసేన నాయకులు స్వాగతం పలికారు. కార్యక్రమంలో తోట మురళీ, చిరువోలు బుచ్చిబాబు, తుంగల మురళీకృష్ణ, ముత్తిరెడ్డి పిచ్చేశ్వరరావు, తోట రంగనాథ్‌, అంగడాల సతీష్‌, ఎదరువాడ శ్రీనివాసరావు, జనసేన నాయకులు వడ్డి నాగేశ్వరరావు, గరికపాటి నాగేశ్వరరావు, బయ్యా రాము, వేగిరెడ్డి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-17T01:10:29+05:30 IST