విద్యాలయాల్లో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి
ABN , First Publish Date - 2023-12-03T00:33:49+05:30 IST
ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులు పోస్టులు, విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ల పోస్టులు భర్తీ చేయకుండా విద్యా ప్రమాణాలు ఎలా మెరుగు పడతాయని కృష్ణా -గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు ప్రశ్నించారు.
జగ్గయ్యపేట, డిసెంబరు 2: ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులు పోస్టులు, విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ల పోస్టులు భర్తీ చేయకుండా విద్యా ప్రమాణాలు ఎలా మెరుగు పడతాయని కృష్ణా -గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు ప్రశ్నించారు. పట్టణంలో విశాఖ ఉక్కు భవన్‌లో శనివారం జరిగిన ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా మహాసభకు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్ షిప్ బకాయిలు విడుదల చేయాలన్నారు. వసతి దీవెన, విద్యా దీవెన, అమ్మఒడి పథకాలను ప్రతి ఒక్క విద్యార్థికి అందించాలని డిమాండ్ చేశారు. నాడు - నేడు పనులు పూర్తి చేయాలని, వీఎస్పీ ప్రైవేటీకరణను ప్రభుత్వం అడ్డుకోవాలని డిమాండ్ చే శారు. పెరిగిన ధరలకు అను గుణంగా సంక్షేమ హాస్టళ్ల మెస్, కాస్మోటిక్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రతి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, నియోజకవర్గ కేంద్రంలో డిగ్రీకళాశాలను ఏర్పాటు చేయాలన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఎ.అశోక్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చాక విద్యా విధానం సర్వనాశనమైపోయిందన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటి సభ్యులు ఎం.సోమేవ్వరరావు, జిల్లా కార్యదర్శి సీహెచ్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
మహాసభ ప్రారంభం సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించింది. వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులతో ఎన్టీఆర్ సర్కిల్ నుంచి బలుసుపాడు జంక్షన్ వరకు ర్యాలీ చేశారు. అనంతరం విశాఖ ఉక్కు భవన్‌లో బహిరంగ సభ నిర్వహించారు.