ఉత్సాహంగా అథ్లెటిక్ పోటీలు
ABN , First Publish Date - 2023-12-11T01:32:20+05:30 IST
ఏజీ అండ్ ఎస్‌జీఎస్ కళాశాలలో రెండు రోజులుగా కృష్ణా విశ్వవిద్యాలయ 12వ అంతర్ కళాశాలల అథ్లెటిక్స్ పోటీలు ఉత్సాహభరితంగా జరుగుతున్నాయి. విశ్వ విద్యాలయ పరిధిలో పలు కళాశాలల నుంచి పలు వురు విద్యార్థులు పోటీల్లో పాల్గొని ప్రతిభ కనపరుస్తున్నారు.
ఉయ్యూరు, డిసెంబరు 10 : ఏజీ అండ్ ఎస్‌జీఎస్ కళాశాలలో రెండు రోజులుగా కృష్ణా విశ్వవిద్యాలయ 12వ అంతర్ కళాశాలల అథ్లెటిక్స్ పోటీలు ఉత్సాహభరితంగా జరుగుతున్నాయి. విశ్వ విద్యాలయ పరిధిలో పలు కళాశాలల నుంచి పలు వురు విద్యార్థులు పోటీల్లో పాల్గొని ప్రతిభ కనపరుస్తున్నారు. సోమవారంతో ముగియనున్న పోటీలలో విజేతలకు బహుమతులు అందజేయ నున్నట్టు నిర్వాహకులు తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ వి.శ్రీరామ్, వ్యాయామ ఉపాధ్యాయులు పర్యవేక్షిస్తున్నారు. ఫ పురుషుల షాట్‌పుట్‌లో విజయవాడ పీబీ సిద్ధార్థ డిగ్రీ కళాశాల విద్యార్థి బి. సిద్ధార్థ్ ప్రథమ, ఏజీ అండ్ ఎస్‌జీఎస్ కళాశాలకు చెందిన ఎం కుమార్‌రాజ ద్వితీయ స్థానాలు గెలుచు కున్నారు. ఫ పురుషుల డెకెత లాన్‌లో అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన పి.తరుణ్ ప్రథమ, ఇబ్రహీం పట్నం జాకీర్‌హుస్సేన్ కళాశాలకు చెందిన కె.లోకేశ్ ద్వితీయ స్థానాలు కైవసం చేసుకున్నారు.
ఫ వంద మీటర్ల పరుగులో జాకీర్ హుస్సేన్ కళా శాలకు చెందిన టి.విజయరామరాజు ప్రథమ, అదే కళాశలకు చెందిన ఏ.రాజేశ్ ద్వితీయ స్థానాలు సాధిం చారు.ఫ వందమీటర్ల మహిళల పరుగులో ఏజీ అండ్ ఎస్‌జీఎస్ కళాశాలకు చెందిన ఎస్‌కే జుబేదా ప్రథమ, నాగమల్లీశ్వరి ద్వితీయ స్థానాలు సాధించారు.