రైతుల ఉద్యమానికి మద్దతుగా నిలవాలి

ABN , First Publish Date - 2023-05-27T01:25:14+05:30 IST

రైతుల ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని రైతు సంఘాల నేతలు రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌కు వినతి పత్రం అందజేశారు. శుక్రవారం వివిధ రైతు సంఘాల ప్రతినిధులు సూర్యారావుపేటలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో కనకమేడలను కలి శారు.

 రైతుల ఉద్యమానికి మద్దతుగా నిలవాలి

గవర్నర్‌పేట, మే 26 : రైతుల ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని రైతు సంఘాల నేతలు రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌కు వినతి పత్రం అందజేశారు. శుక్రవారం వివిధ రైతు సంఘాల ప్రతినిధులు సూర్యారావుపేటలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో కనకమేడలను కలి శారు. అన్ని పంటలకు డాక్టర్‌ స్వామినాథన్‌ సూచించిన సీ 2 ప్లస్‌ 50 శాతం ప్రకారం మద్దతు ధరల గ్యారంటీ చట్టం చేయాలని కోరుతూ రైతు లు చేస్తున్న ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరారు. భారత రైతాంగం ఎదుర్కొంటున్న కీలక సమస్యల పరిష్కారం కోసం సంయుక్త కిసాన్‌ మోర్చా మరో దీర్ఘకాలిక పోరాటానికి సమాయత్తమౌతోందని, పోరాటంలో పార్లమెంటు పరిధిలో ఉన్న రైతు ప్రతినిధిగా మద్దతుగా నిలవాలని, రైతు ల పోరాటంలో ప్రత్యక్ష భాగస్వామి కావాలని కోరారు. 60 సంవత్సరాలు నిండిన రైతులు, కౌలు రైతులకు నెలకు రూ. 6 వేలు పెన్షన్‌ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేయాలని, ప్రైవేట్‌ అప్పులతో సహా అన్ని రకాల రైతు రుణాలను మాఫీ చేసేలా పార్లమెంటులో గళం వినిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీని కలిసిన వారిలో రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్‌ వడ్డే శోభనాద్రీశ్వరరావు, రైతు సంఘం సీనియర్‌ నాయకులు వై. కేశవరావు, సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఆళ్ల వెంకట గోపాలకృష్ణ తదితరులు ఉన్నారు.

Updated Date - 2023-05-27T01:25:14+05:30 IST