ట్రూ అప్ చార్జీలు మోపడం దారుణం
ABN , First Publish Date - 2023-06-11T00:33:22+05:30 IST
విద్యుత్ బిల్లుల్లో ట్రూఅప్ చార్జీలు వేసి, ఆ భారాన్ని ప్రజలపై మోపడం దారుణమని, వైసీపీ ప్రభుత్వం అదనపు విద్యుత్ చార్జీలు వేసి, ప్రజలపై పెనుభారం మోపుతోందని టీడీపీ పెడన నియోజకవర్గ ఇన్‌చార్జి కాగిత కృష్ణప్రసాద్ అన్నారు.
కృత్తివెన్ను, జూన్ 10: విద్యుత్ బిల్లుల్లో ట్రూఅప్ చార్జీలు వేసి, ఆ భారాన్ని ప్రజలపై మోపడం దారుణమని, వైసీపీ ప్రభుత్వం అదనపు విద్యుత్ చార్జీలు వేసి, ప్రజలపై పెనుభారం మోపుతోందని టీడీపీ పెడన నియోజకవర్గ ఇన్‌చార్జి కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. పెంచిన విద్యుత్ బిల్లు లను తగ్గించాలని కృత్తివెన్ను విద్యుత్ సబ్‌స్టేషన్‌వద్ద టీడీపీ ఆధ్వర్యంలో శనివారం నిరసన తెలిపారు. నాయకులు ఒడుగు తులసీరావు, పిన్నింటి రత్తయ్య, నెక్కంటి భాస్కరరావు, కూనసాని చిన్న, కూనసాని శ్రీనివాస రావు, నాగిడి చెన్నకేశవరావు పాల్గొన్నారు.