ఫ్లుట్టర్ మొబైల్ అప్లికేషన్ డెవలప్‌మెంట్‌పై శిక్షణ ప్రారంభం
ABN , First Publish Date - 2023-09-26T00:39:55+05:30 IST
మొబైల్ వినియోగదారుల అవసరాలకు తగిన విధంగా మరిన్ని అప్లికేషన్‌లు తయారు చేయడంపై దృష్టిపెట్టాలని, అలాంటి వారికి ఫ్లుట్టర్ సాకేంతికత మరింత ఉపయోగపడుతుందని ప్రగ్మాటిక్ సిస్టమ్స్ ఇన్ హైదరాబాద్ సీనియర్ మేనేజర్ సునీల్ మనోహర్ పోతురాజు చెప్పారు.

ఫ్లుట్టర్ మొబైల్ అప్లికేషన్ డెవలప్‌మెంట్‌పై శిక్షణ ప్రారంభం
మొగల్రాజపురం, సెప్టెంబరు 24: మొబైల్ వినియోగదారుల అవసరాలకు తగిన విధంగా మరిన్ని అప్లికేషన్‌లు తయారు చేయడంపై దృష్టిపెట్టాలని, అలాంటి వారికి ఫ్లుట్టర్ సాకేంతికత మరింత ఉపయోగపడుతుందని ప్రగ్మాటిక్ సిస్టమ్స్ ఇన్ హైదరాబాద్ సీనియర్ మేనేజర్ సునీల్ మనోహర్ పోతురాజు చెప్పారు. పీబీ సిద్ధార్థ కంప్యూటర్ సైన్స్ విభాగం పీజీ కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకు ఫ్లుట్టర్ మొబైల్ అప్లికేషన్ డెవలప్‌మెంట్‌పై నిర్వహించే 30 గంటల శిక్షణా కార్యక్రమం సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి శిక్షకులుగా వ్యవహరిస్తున్న ఆయన మాట్లాడుతూ ప్రజలు రోజు వారీ అవసరాలను మొబైల్ ద్వారా నేరవేర్చుకుంటున్నారని, రాబోయే రోజుల్లో మరిన్ని అవసరాలకు మరిన్ని అప్లికేషన్‌లు అవసరం అవుతాయన్నారు. ఫ్లుట్టర్ టెక్నాలజీ ద్వారా ప్రజల అవసరాలకు తగిన విధంగా అతి తక్కువ సమయంలో సులభంగా అప్లికేషన్‌లు తయారు చేయవచ్చని చెప్పారు. యాపిల్, ఆండ్రాయిడ్ ఫోన్‌లకు కూడా ఈ అప్లికేషన్‌లు ఉపయోగపడతాయన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేకా రమేష్, డైరెక్టర్ వేమూరి బాబూరావు, డీన్ రాజేష్, కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి డాక్టర్ టిఎస్. రవికిరణ్, పీజీ కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు పాల్గొన్నారు.