లయోలలో కెరీర్ గైడెన్స్‌పై శిక్షణ తరగతులు
ABN , First Publish Date - 2023-06-07T00:45:58+05:30 IST
క్రిషి, యువజన సర్వీసుల శాఖ, ఎన్‌టిఆర్ జిల్లా ఆధ్వర్యంలో మంగళవారం లయోల ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు కెరీర్ గైడెన్స్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌పై శిక్షణ తరగతులు నిర్వహించారు.
లయోలలో కెరీర్ గైడెన్స్‌పై శిక్షణ తరగతులు
పటమట, జూన్ 6 : క్రిషి, యువజన సర్వీసుల శాఖ, ఎన్‌టిఆర్ జిల్లా ఆధ్వర్యంలో మంగళవారం లయోల ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు కెరీర్ గైడెన్స్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌పై శిక్షణ తరగతులు నిర్వహించారు. యూత్ సర్వీసెస్ అసిస్టెంట్ మేనేజర్ నిమ్మగడ్డ నాగేశ్వరరావు మాట్లాడుతూ హైస్కూలు స్థాయి నుంచి డిగ్రీ, పీజి స్థాయి విద్యార్థులకు సమాజంలో నానాటికి దిగజారుతున్న విలువలపై అవగాహన నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిపారు. ఈ సదస్సు నుంచి విద్యార్థులకు సమయపాలన, విద్య పట్ల శ్రద్ధ, లక్ష్యం ఏర్పరుచుకుని భవిష్యత్తులో ఏవిధంగా ముందుకు వెళ్లాలో ప్రముఖ సైకాలజిస్ట్‌లు తేజోవతి, జగదీష్‌లు వివరించారు. కళాశాల ప్రిన్సిపాల్ మహేష్, హెచ్‌వోడీ సుధాకర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ దైవకృప, అధ్యాపకులు మణికంఠ, జిల్లా యువజన సంక్షేమ అధికారి యు. శ్రీనివాసరావు, అధ్యాపక బృందం, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.