నేడు ట్రాఫిక్‌ మళ్లింపు

ABN , First Publish Date - 2023-05-26T00:54:16+05:30 IST

తుళ్లూరు మండలం వెంకటపాలెంలోని టీటీడీ ఆలయం పక్కన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ నేపథ్యంలో శుక్రవారం ఉదయం 4 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ట్రాఫిక్‌ మళ్లింపు అమల్లో ఉంటుందని పోలీస్‌ కమిషనర్‌ కాంతిరాణా ఒక ప్రకటనలో తెలిపారు.

నేడు ట్రాఫిక్‌ మళ్లింపు

గుణదల, మే 25 : తుళ్లూరు మండలం వెంకటపాలెంలోని టీటీడీ ఆలయం పక్కన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ నేపథ్యంలో శుక్రవారం ఉదయం 4 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ట్రాఫిక్‌ మళ్లింపు అమల్లో ఉంటుందని పోలీస్‌ కమిషనర్‌ కాంతిరాణా ఒక ప్రకటనలో తెలిపారు.

  • చెన్నై వైపు నుంచి విజయవాడ మీదుగా విశాఖపట్నం, ఇబ్రహీంపట్నం, నందిగామ వైపు వెళ్లే వాహనాలు ఒంగోలు జిల్లా త్రోవగుంట వద్ద నుంచి చీరాల, బాపట్ల, రేపల్లె, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, హనుమాన్‌ జంక్షన్‌ మీదుగా విశాఖపట్నం, ఇబ్రహీంపట్నం వైపునకు మళ్లిస్తారు.

  • చెన్నై నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్లే వాహనాలు మేదరమెట్ల, అద్దంకి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, నార్కెట్‌పల్లి మీదుగా హైదరాబాద్‌ వెళ్లాలి. చిలకలూరిపేట నుంచి విశాఖపట్నం వైపు వెళ్లే వాహనాలను చిలకలూరిపేట నుంచి ఎన్‌హెచ్‌-16 మీద పెదనందిపాడు, కాకుమాను, పొన్నూరు, చందోలు, చెరుకుపల్లి, భట్టిప్రోలు, పెనుమూడి బ్రిడ్జి మీదుగా అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, హనుమాన్‌ జంక్షన్‌ మీదుగా విశాఖపట్నం మళ్లిస్తారు.

  • చెన్నై నుంచి విశాఖపట్నం వెళ్లే వాహనాలను బోయపాలెం క్రాస్‌ వద్ద నుంచి ఉన్నం గ్రామం ఏబీ పాలెం వల్లూరు, పాండ్రపాడు, పొన్నూరు, చందోలు, చెరుకుపల్లి, భట్టిప్రోలు, పెనుమూడి బ్రిడ్జి మీదుగా అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, హనుమాన్‌ జంక్షన్‌ మీదుగా విశాఖపట్నం మళ్లిస్తారు.

  • హనుమాన్‌ జంక్షన్‌ వైపు నుంచి హైదరాబాద్‌ వెళ్లాల్సిన వాహనాలను గన్నవరం, ఆగిరిపల్లి, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం వైపు మళ్లిస్తారు.

Updated Date - 2023-05-26T00:54:16+05:30 IST