వన్‌టౌన్‌లో నిలిచిన ట్రాఫిక్‌

ABN , First Publish Date - 2023-06-11T01:07:20+05:30 IST

వన్‌టౌన్‌లోని దుర్గగుడి పరిసర ప్రాంతాలు శనివారం తీవ్ర ట్రాఫిక్‌ చిక్కుముడి ఏర్పడడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు.

వన్‌టౌన్‌లో నిలిచిన ట్రాఫిక్‌

విద్యాధరపురం, జూన్‌ 10 : వన్‌టౌన్‌లోని దుర్గగుడి పరిసర ప్రాంతాలు శనివారం తీవ్ర ట్రాఫిక్‌ చిక్కుముడి ఏర్పడడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. కార్లు, బస్సులు, ఆటోలు ఇతర వాహనాల తో రోడ్డు జామయ్యింది. దుర్గగుడికి వచ్చే భక్తుల వాహనాలు, ఆటోలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. కుమ్మరిపాలెం, రథం సెంటర్‌, ఫై ఓవర్‌ కింద డైవర్షన్‌ రూట్లు అన్నీ కదలలేని పరిస్థితి. అసలే ఉక్కపోతతో సతమతమవుతుంటే ట్రాఫిక్‌ జామ్‌తో పి ల్లలు, వృద్ధులు, మహిళలు నానాయాతన పడ్డారు. ట్రాఫిక్‌ సీఐ సుధాకర్‌ తన సిబ్బందితో కలిసి మండుటెండలో సుమారు గంటన్నర పాటు కసరత్తు చేసి ట్రాఫిక్‌ సజావుగా వెళ్లేందుకు మార్గం సుగమం చేశారు.

Updated Date - 2023-06-11T01:07:20+05:30 IST