ఉద్యోగం ఇప్పిస్తానని టోకరా
ABN , First Publish Date - 2023-11-06T01:12:14+05:30 IST
ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తిపై అజిత్‌సింగ్‌నగర్ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు.
బాధితుడి ఫిర్యాదుతో మోసం చేసిన వ్యక్తిపై కేసు
అజిత్‌సింగ్‌నగర్, నవంబరు 5: ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తిపై అజిత్‌సింగ్‌నగర్ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. వేముల ఉపేంద్ర పాయకాపురం పాత రాజీవ్‌నగర్‌లో ఉంటున్నాడు. ఉపేంద్రకు అజిత్‌సింగ్‌నగర్ నందమూరినగర్ ప్రాంతానికి చెందిన పవన్‌కుమార్‌తో పరిచయం ఉంది. రెండు నెలల క్రితం తనకు నగరపాలకసంస్థలో చాలా మంది అధికారులు తెలుసు అని ఉద్యోగాలు ఇప్పిస్తానని ఉపేంద్రను పవన్ నమ్మబలికాడు. దీంతో పవన్‌కు ఉపేంద్ర రూ.3,30,000 ముట్టచెప్పాడు. ఉద్యోగ విషయమై ఇటీవల ప్రశ్నించగా సరైన సమాధానం రాకపోగా పవన్ కనిపించడం మానేశాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు అజిత్‌సింగ్‌నగర్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.