నేడు గవర్నర్ వీడ్కోలు సభ
ABN , First Publish Date - 2023-02-21T01:15:44+05:30 IST
ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా నియమితులైన రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ వీడ్కోలు సభను ప్రభుత్వం ఎ.కన్వెన్షన్ సెంటర్‌లో మంగ ళవారం నిర్వహించనుంది.
హాజరుకానున్న ముఖ్యమంత్రి జగన్
ఏర్పాట్లు పరిశీలించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ దిల్లీరావు
కలెక్టరేట్, ఫిబ్రవరి 20: ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా నియమితులైన రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ వీడ్కోలు సభను ప్రభుత్వం ఎ.కన్వెన్షన్ సెంటర్‌లో మంగ ళవారం నిర్వహించనుంది. కార్యక్రమ ఏర్పాట్లను సోమవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ దిల్లీరావు అధికారులతో కలిసి పరిశీలించి, పలు సూచనలు చేశారు. సభను విజయ వంతం చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆయ న ఆదేశించారు. వీడ్కోలు కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ముఖ్య అతి థిగా విచ్చేస్తారని, పలువురు న్యాయమూర్తులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ప్రభుత్వ సలహాదారులు, ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరవుతారని తెలిపారు. అతి థులకు అసౌకర్యం కలుగకుండా ప్రొటోకాల్ అధికారులు చర్యలు తీసుకోవాలని కలె క్టర్ సూచించారు. జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్, సబ్ కలెక్టర్ అదితి సింగ్, మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, డీఆర్వో కె.మోహన్‌కుమార్, డీఎం హెచ్‌వో డాక్టర్ ఎం.సుహాసిని, డీసీఎస్‌వో పి.కోమలిపద్మ, డీఐ పీఆర్వో ఎం.సురేంద్ర నాథ్, జిల్లా ఫైర్ అధికారి శ్రీనివాసరావు, విద్యుత్ ఈఈ వీవీ సుధాకర్ పాల్గొన్నారు.