లడ్డూ ప్రసాదానికి విశేష స్పందన
ABN , First Publish Date - 2023-06-11T01:04:44+05:30 IST
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి భక్తులకు నుంచి విశేష స్పందన లభించింది.
లబ్బీపేట, జూన్ 10 : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి భక్తులకు నుంచి విశేష స్పందన లభించింది. ప్రతి నెల రెండో శనివారం శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని టీటీడీ కల్యాణ మండపంలో విక్రయిస్తారు. ఈ నేపథ్యంలో శనివారం 3వేల లడ్డూలను భక్తులకు విక్రయించారు. కల్యాణ మండపం మేనేజర్ భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ శ్రీవారి లడ్డూ ప్రసాదానికి భక్తుల నుంచి అధిక స్పందన వస్తుందని, రద్దీని దృష్టిలో ఉంచుకుని 3వేల లడ్డూలను కేటాయిస్తున్నామన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఈ శనివారం భక్తుల తాకిడి అధికంగా ఉందని అందుకు తగిన ఏర్పాట్లతో విక్రయాలు నిర్వహించినట్టు తెలిపారు.