టెన్త్‌ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు

ABN , First Publish Date - 2023-03-12T00:45:40+05:30 IST

పదో తరగతి పరీక్షలు ఏప్రిల్‌ 3 వతేదీ నుంచి 18వ తేదీ వరకు జరుగుతాయని, దీనికోసం పటిష్ట ఏర్పాట్లు చేసినట్టు డీఈవో తాహెరా సుల్తానా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కృష్ణాజిల్లాలో పరీక్షలకు 143 కేంద్రాల్లో 22,367 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు.

టెన్త్‌ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు

మచిలీపట్నం టౌన్‌, మార్చి 11 : పదో తరగతి పరీక్షలు ఏప్రిల్‌ 3 వతేదీ నుంచి 18వ తేదీ వరకు జరుగుతాయని, దీనికోసం పటిష్ట ఏర్పాట్లు చేసినట్టు డీఈవో తాహెరా సుల్తానా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కృష్ణాజిల్లాలో పరీక్షలకు 143 కేంద్రాల్లో 22,367 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. రెగ్యులర్‌ విద్యార్థులు 19,866 మంది, ప్రైవేట్‌ విద్యార్థులు 2501 మంది హాజరవుతారన్నారు. వీరిలో బాలురు 12,031 మంది, బాలికలు 10,366 మంది హాజరవుతున్నారు.143 మంది చీఫ్‌ సూపరింటెండెంట్‌లు, 143 మంది డిపార్ట్‌మెంటల్‌ అధికారులను నియమించారు. ప్రశ్నాపత్రాలను 10 రూట్లలో పోలీసు స్టేషన్లకు తరలించేందుకు రంగం సిద్ధం చేశారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు జరిగే పరీక్షలకు అవసరమైన ఇన్విజిలేటర్లను, ఐదు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144వ సెక్షన్‌కు ఉత్తర్వులు జారీ చేశారు. పరీక్షలు నిర్వహించే సమయంలో జెరాక్స్‌, ఇంటర్‌నెట్‌ సెంటర్లు మూసివేస్తారు. పరీక్షల్లో మాల్‌ ప్రాక్టీస్‌ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని డీఈవో తెలిపారు. హాల్‌ టికెట్‌ చూపిస్తే ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చన్నారు. పరీక్షల నిర్వహణలో సమస్యలు ఎదురైతే తనను సంప్రదించాలని డీఈవో తెలిపారు.

Updated Date - 2023-03-12T00:45:40+05:30 IST