భవానీపురం పీఎస్‌లో బాధితులకు న్యాయం కరువు

ABN , First Publish Date - 2023-03-20T00:57:47+05:30 IST

భవానీపురం పోలీసుస్టేషన్‌లో బాధితులకు న్యాయం కరువైందని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి, పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి పోతిన వెం కట మహేష్‌ ఆరోపించారు. పోలీసు స్టేషన్‌ పరిధిలో లైంగిక దాడికి గురైన బాలిక తల్లి దండ్రులను శనివారం రాత్రి ఆయన పరామర్శించారు.

భవానీపురం పీఎస్‌లో బాధితులకు న్యాయం కరువు

పదేళ్ల బాలికపై లైంగిక దాడి..తల్లిదండ్రులు స్టేషన్‌కు వెళితే ఫిర్యాదు తీసుకోని పోలీసులు

ఎమ్మెల్యే వెలంపల్లి ఒత్తిడితో బాలిక తల్లిదండ్రులపైనే కేసు: జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్‌ ఆరోపణ

విద్యాధరపురం, మార్చి 19: భవానీపురం పోలీసుస్టేషన్‌లో బాధితులకు న్యాయం కరువైందని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి, పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి పోతిన వెం కట మహేష్‌ ఆరోపించారు. పోలీసు స్టేషన్‌ పరిధిలో లైంగిక దాడికి గురైన బాలిక తల్లి దండ్రులను శనివారం రాత్రి ఆయన పరామర్శించారు. పదేళ్ల బాలికైన తన కుమార్తెపై లైంగిక దాడి జరిగిందని ఓ న్యాయవాది భవానీపురం స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళి తే పోలీసులు తీసుకోలేదన్నారు. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు ఒత్తిడితో లైంగిక దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేయలేదని, బాధితురాలి తల్లి దండ్రులపై కేసు నమోదు చేసి ఎఫ్‌ఐఆర్‌ రాశారని, ఇది శోచనీయమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుపై భవానీపురంలో పోక్సో కేసు గానీ, జీరో ఎఫ్‌ఐఆర్‌ కానీ నమోదు చేసే అవకాశమున్నా దిశ పోలీసుస్టేషన్‌కు అర్ధ రాత్రి పంపించడం ఏమిటని ప్రశ్నించారు. నగర పోలీసు కమిషనర్‌ కాంతిరాణా బాధితు లకు న్యాయం చేయాలన్నారు. బాధితులపై అక్రమంగా నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలన్నారు. బెజవాడ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు చంద్రగిరి విష్ణువర్ధన్‌ తన సహచర న్యాయవాదికి అండగా నిలవలేదని, ఆయనపై అధికారపార్టీ ఒత్తిళ్లు ఉన్నాయే మోనని అనుమానం కలుగుతోందని, దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2023-03-20T00:57:47+05:30 IST