యువగళం పాదయాత్రకు విశేష స్పందన

ABN , First Publish Date - 2023-03-05T00:35:42+05:30 IST

నారా లోకేశ్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యువగళం పాదయాత్రకు విశేష స్పందన వస్తోందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ తెలిపారు.

యువగళం పాదయాత్రకు విశేష స్పందన

పటమట, మార్చి 4 : నారా లోకేశ్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యువగళం పాదయాత్రకు విశేష స్పందన వస్తోందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ తెలిపారు. శనివారం ఉదయం పుంగనూరు నియోజకవర్గం కొక్కువారిపల్లి విడిది కేంద్రం వద్ద ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌, ఆయన తనయుడు గద్దె రాజే్‌షతో కలిసి నారా లోకే్‌షతో కొద్దిసేపు ముచ్చటించారు. అనంతరం ప్రారంభమైన పాదయాత్రలో గద్దె రామ్మోహన్‌, గద్దె రాజేష్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్‌ మాట్లాడుతూ యువతకు భవిత, భరోసా ఇచ్చేందుకు లోకేష్‌ చేస్తున్న పాదయాత్ర రాష్ట్రంలో చరిత్ర సృష్టించబోతోందన్నారు. లోకేష్‌ పాదయాత్ర రోజు రోజుకు అంచనాలు దాటి సత్ఫలితాలు అందిస్తోందని, ఈ పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను లోకేష్‌ నేరుగా చూస్తున్నారన్నారు. గత టీడీపీ ప్రభుత్వం రాష్ర్టానికి ఏ పరిశ్రమలు తెచ్చిందీ, ప్రజలకు వివరించేలా పాదయాత్రలో ఆయా కంపెనీల వద్ద ఫొటో పోస్ట్‌ చేయడం ద్వారా, తాము తెచ్చిన పరిశ్రమలను ప్రజలకు గుర్తు చేస్తున్నారన్నారు.

Updated Date - 2023-03-05T00:35:42+05:30 IST