Share News

సీఎం జగన్‌ చేతగాని పాలనతో రాష్ట్రం అప్పులపాలు

ABN , Publish Date - Dec 17 , 2023 | 12:51 AM

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అవగా హన లేమి, చేతగాని పాలనతో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిం దని టీడీపీ పొలిట్‌బ్యూరోసభ్యుడు కొల్లు రవీంద్ర విమర్శించారు. పార్టీ గుడి వాడ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశాన్ని శనివారం స్థానిక ఓ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహిం చారు.

సీఎం జగన్‌ చేతగాని పాలనతో రాష్ట్రం అప్పులపాలు
ఐక్యతా చిహ్నాన్ని చూపుతున్న టీడీపీ నాయకులు

గుడివాడలో టీడీపీ జోరుతో కొడాలి నానికి నిద్రలేని రాత్రుళ్లు

టీడీపీ నియోజకవర్గ విస్తృత సమావేశంలో కొల్లు రవీంద్ర

గుడివాడ, డిసెంబరు 16: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అవగా హన లేమి, చేతగాని పాలనతో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిం దని టీడీపీ పొలిట్‌బ్యూరోసభ్యుడు కొల్లు రవీంద్ర విమర్శించారు. పార్టీ గుడి వాడ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశాన్ని శనివారం స్థానిక ఓ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహిం చారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి టీడీపీ నేతలు కొల్లు రవీంద్ర, పిన్నమనేని వెంక టేశ్వరరావు, కొనకళ్ల నారాయణరావు, రావి వెంకటేశ్వరరావు, వెనిగండ్ల రాము పూలమాలలు వేసి నివాళులర్పించారు. గుడివాడలో టీడీపీ నిర్వహి స్తున్న కార్యక్రమాలతో ఎమ్మెల్యే కొడాలి నానినిద్రలేని రాత్రులు గడుపుతు న్నాడని, మంత్రిగా పనిచేసిన కాలంలో నాని భారీ అవినీతికి పాల్పడ్డాడని రవీంద్ర ఆరోపించారు. ఎడ్ల పందాల ముసుగులో పేకాట, క్యాసినో నిర్వ హించి వేలాది కోట్ల ప్రజలు సొమ్మును దోచేశాడని ఆరోపించారు. ప్రపంచ వ్యాప్తంగా రాజధాని లేని ఏకైక రాష్ట్రం ఏపీ కావడం దౌర్భాగ్యమని మాజీ ఎంపీ కొనకళ్ల ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అరాచకపాలన సాగుతోం దని, దీనిని అంతం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, మంత్రిగా కొడాలి వేల కోట్లు సంపాదించాడని మాజీ ఎమ్మెల్యే రావి ఆరోపించారు.

గుడివాడలో పసుపుజెండా ఎగరేద్దాం: వెనిగండ్ల రాము

‘‘ఇరవై ఏళ్లుగా నియోజకవర్గం వెనుకబాటుతనానికి గురైంది. ఒక తరం పూర్తిగా నష్టపోయింది. చేతకాని ఎమ్మెల్యే చేతుల్లో నియోజకవర్గం సర్వనా శనమైంది. ప్రజల సొమ్మును దోపిడీ చేస్తున్న నాని, అతని అనుచరులకు రానున్న ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి గుడివాడలో తిరిగి పసుపుజెండాను రెపరెపలాడించాలి.’’అని వెనిగండ్ల రాము పిలుపునిచ్చారు. పట్టణ, రూరల్‌, నందివాడ, గుడ్లవల్లేరు మండల కమిటీలు, తెలుగుమహిళ, అనుబంధసంఘాలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Dec 17 , 2023 | 12:51 AM