ప్రతి సమస్యలోనూ రాష్ట్రమే ముందంజ
ABN , Publish Date - Dec 14 , 2023 | 12:42 AM
సీఎం జగన్ ప్రతి అంశంలో మన రాష్ట్రం ముందుంది అంటారే కానీ ఎటు అనేది స్పష్టతనివ్వరని, కేంద్ర గణాంకాల ప్రకారం ప్రతి సమస్యాత్మక విషయాల్లోనూ జగన్ మనరాష్ట్రాన్ని ముందుంజలో ఉంచారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విమర్శించారు.
మొగల్రాజపురం, డిసెంబరు 13: సీఎం జగన్ ప్రతి అంశంలో మన రాష్ట్రం ముందుంది అంటారే కానీ ఎటు అనేది స్పష్టతనివ్వరని, కేంద్ర గణాంకాల ప్రకారం ప్రతి సమస్యాత్మక విషయాల్లోనూ జగన్ మనరాష్ట్రాన్ని ముందుంజలో ఉంచారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విమర్శించారు. బుధవారం 8వ డివిజన్ గాయత్రీనగర్‌లో బాబు ష్యూరిటీ- భవిష్యత్‌కు గ్యారంటీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వయం ఉపాధి నిమిత్తం సోమయ్య అనే వ్యక్తికి ఇస్త్రీ బండి, వి.రాజుకు టిఫిన్ బండిని అందించారు అలాగే స్థానికులతో మాట్లాడారు. అనంతరం మీడియాతోమాట్లాడుతూ నేరాలు, గంజాయివిక్రయాలు, మాదక ద్రవ్యాల వినియోగంలో రాష్ట్రాన్ని ముందుంచారన్నారు. రోడ్ల వెంట ఇనుప ముక్కలు దొంగిలించే వ్యక్తులు చంద్రబాబు పాలనలో ఉపాఽధి పనులకు మళ్లి మంచివారుగా మారితే జగన్ పాలనలో ఉపాఽధి లేక చాలామంది కడుపు నింపుకునేందుకు దొంగలుగా మారుతున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని ప్రజలు కంకణం కట్టుకున్నారన్నారు. కార్పొరేటర్ సిహెచ్.ఉషారాణి, డివిజన్ అధ్యక్షుడు జాస్తి లక్ష్మిపతి, కార్యదర్శి మల్లెల రామకృష్ణ, గొర్రెపాటి ముర ళీ, మెరకనపల్లి నాగేశ్వరరావు, నారు రామారావు, కొత్తపల్లి రమేష్, దేవపోంగ కృపారావు పాల్గొన్నారు.