ఆరోగ్య మిత్రలకు వేతనాలు పెంచాలి

ABN , First Publish Date - 2023-05-26T00:59:59+05:30 IST

ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు నేతృత్వంలో ఆరోగ్య మిత్ర యూనియన్‌ నాయకులు గురువారం వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి ఎంటీ కృష్ణబాబును కలిసి ఆరోగ్య మిత్రలకు వేతనాలు పెంచాలని విజ్ఞప్తి చేశారు.

ఆరోగ్య మిత్రలకు వేతనాలు పెంచాలి

ఆరోగ్య మిత్రలకు వేతనాలు పెంచాలి

యూనియన్‌ నాయకుల వినతి

గవర్నర్‌పేట, మే 25: ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు నేతృత్వంలో ఆరోగ్య మిత్ర యూనియన్‌ నాయకులు గురువారం వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి ఎంటీ కృష్ణబాబును కలిసి ఆరోగ్య మిత్రలకు వేతనాలు పెంచాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో వైఎస్సార్‌ ఆరోగ్య ట్రస్టులో పనిచేస్తున్న వేలాది మంది ఆరోగ్య మిత్రులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వేతనాలు పెంచాలని, గ్రేడ్‌ పెంచాలని కోరుతూ మెమొరాండం అందజేశారు. యూనియన్‌ నాయకులు మాచర్ల బుజ్జి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-26T00:59:59+05:30 IST