సైనికుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలి

ABN , First Publish Date - 2023-08-23T00:38:53+05:30 IST

సైనికుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని మేయర్‌ భాగ్యలక్ష్మి పిలుపునిచ్చారు.

సైనికుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలి
మొక్కలు పంపిణీ చేస్తున్న మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి

సైనికుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలి

నా భూమి, నాదేశం, నేలతల్లికి నమస్కారం, వీరులకు వందనంలో మేయర్‌ భాగ్యలక్ష్మి

వన్‌టౌన్‌, ఆగస్టు 22 : సైనికుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని మేయర్‌ భాగ్యలక్ష్మి పిలుపునిచ్చారు. దేశాన్ని రక్షిస్తున్న సైనికుల త్యాగాలకు కృతజ్ఞతలు తెలుపుతూ మంగళవారం పశ్చిమ నియోజకవర్గ్గం 37 వ డివిజన్‌ సీతమ్మవారి పాదాలవద్ద మంగళవారం నా భూమి, నా దేశం, నేలతల్లికి నమస్కారం ,వీరులకు వందనంపేరిట ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు, ఈ సందర్భంగా మేయర్‌ భాగ్యలక్ష్మి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. మొక్కలు నాటడంతో పాటు మునిసిపల్‌ ఉద్యోగులకు మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 2047 నాటికి అభివృద్ధి చెందిన అగ్రగామి దేశంగా భారత దేశాన్ని తీర్చిదిద్దుతామని, ఇందుకు తమ వంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. మునిసిపల్‌ కార్పొరేషన్‌ అదనపు కమిషనర్‌ కేవీ సత్యవతి, ఏడీహెచ్‌ శ్రీనివాస్‌, ఈఈ (పార్కులు) ఏఎస్‌ఎన్‌ ప్రసాద్‌, మేనేజర్‌ శ్రీనివాస్‌, పీఆర్వో రజియా షబీనా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-23T00:38:53+05:30 IST