కోలాహలంగా గంగ, దుర్గ, మల్లేశ్వరుల ఊరేగింపు

ABN , First Publish Date - 2023-04-03T00:59:34+05:30 IST

దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానంలో చైత్ర మాస బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం రావణాసుర వాహనంపై గంగ, దుర్గ, మల్లేశ్వరస్వామి ఉత్సవమూర్తుల ఊరేగింపు కోలాహలంగా సాగింది.

కోలాహలంగా గంగ, దుర్గ, మల్లేశ్వరుల ఊరేగింపు
రావణాసుర వాహనంపై గంగ, దుర్గ, మల్లేశ్వరుల ఉత్సవమూర్తులు

వన్‌టౌన్‌, ఏప్రిల్‌ 2: దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానంలో చైత్ర మాస బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం రావణాసుర వాహనంపై గంగ, దుర్గ, మల్లేశ్వరస్వామి ఉత్సవమూర్తుల ఊరేగింపు కోలాహలంగా సాగింది. ఈవో భ్రమరాంబ, ట్రస్ట్‌బోర్డు ఛైర్మన్‌ కర్నాటి రాంబాబు, సభ్యులు, ఆలయ వైదిక కమిటీ సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు. కనకదుర్గనగర్‌ నుంచి బ్రాహ్మణవీధి మీదుగా కోమలవిలాస్‌ సెంటర్‌కు చేరుకుని అక్కడి నుంచి మెయిన్‌బజార్‌, రథం సెంటర్‌ మీదుగా కొండపైకి ఊరేగింపు చేరు కుంది. భక్తులు స్వామి వారి నామాలను పఠిస్తూ సాగారు.

Updated Date - 2023-04-03T00:59:34+05:30 IST