ప్లాస్టిక్‌ అంతమే ఫోరం లక్ష్యం

ABN , First Publish Date - 2023-06-03T00:56:08+05:30 IST

కేంద్ర హౌసింగ్‌, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహకారంతో ప్లాస్టిక్‌ వ్యర్థాలను నిర్వహించడం, నగరాల్లో ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని అంతం చేయటం అనే ప్రక్రియ దేశ వ్యాప్తంగా బలోపేతం చేయుటయే ఫోరం ప్రధాన లక్ష్యమని వీఎంసీ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అన్నారు.

ప్లాస్టిక్‌ అంతమే ఫోరం లక్ష్యం

చిట్టినగర్‌, మే 2 : కేంద్ర హౌసింగ్‌, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహకారంతో ప్లాస్టిక్‌ వ్యర్థాలను నిర్వహించడం, నగరాల్లో ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని అంతం చేయటం అనే ప్రక్రియ దేశ వ్యాప్తంగా బలోపేతం చేయుటయే ఫోరం ప్రధాన లక్ష్యమని వీఎంసీ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అన్నారు. యునైటెడ్‌ నేషన్స్‌ ఎన్విరాన్మెంట్‌ ప్రోగ్రాం (యు ఎన్‌ఈపీ) వారు గత నెల 25 నుంచి 28 వరకు ఫ్రాన్స్‌లోని ప్యారిస్‌ నగరంలో ‘‘నగరాల్లో ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని అంతం చేయడానికి అంతర్జాతీయ ఫోరం’’ ఏర్పాటు చేయడంపై శుక్రవారం వీఎంసీ కార్యాలయంలోని తన చాంబర్‌లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ కాన్ఫరెన్స్‌లో దేశం నుంచి మూడు నగరాలు ప్రాతినిధ్యం వహించాయని, అందులో విజయవాడ ఒకటన్నారు. నగరంలోని జరుగుతున్న సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ విధానాన్ని వివరించామన్నా రు. ప్యారి్‌సలో అర్బన్‌ డెవల్‌పమెంట్‌ను పరిశీలించామని, ఫుట్‌పాత్స్‌, జిబ్రా క్రాసింగ్స్‌ చాలా బాగున్నాయన్నారు. నగరంలో తడిచెత్త, పొడిచెత్త రీసైక్లింగ్‌ విధానాన్ని మెచ్చుకున్నారన్నారు. ప్యారిస్‌ నగరంలోని రోడ్లతో పోల్చుకుంటే మన నగరంలోని రోడ్లు బాగున్నాయన్నారు.

Updated Date - 2023-06-03T00:56:08+05:30 IST