Share News

టీడీపీ ప్రభుత్వంతోనే భవిష్యత్తుకు గ్యారెంటీ

ABN , Publish Date - Dec 27 , 2023 | 12:43 AM

రాష్ట్రాభివృద్ధి, ప్రజల భవిష్యత్తుకు గ్యారెంటీ తెలుగుదేశం ప్రభుత్వం హాయంలోనే సాధ్యం అని, చంద్రబాబు ప్రకటించిన భవిష్యతు గ్యారెంటీ సూపర్‌సిక్స్‌ పథకాల అమలు ప్రజలకు బంగారు భవిష్యత్‌ను అందిస్తుందని టీడీపీ నియోజకవర్గం ఇన్‌చార్జి శావల దేవదత్‌ అన్నారు.

టీడీపీ ప్రభుత్వంతోనే భవిష్యత్తుకు గ్యారెంటీ
ఒకటవ వార్డులో భవిష్యత్తు గ్యారెంటీలో శావల దేవదత్‌ తదితరులు

టీడీపీ ప్రభుత్వంతోనే భవిష్యత్తుకు గ్యారెంటీ

టీడీపీ నియోజకవర్గం ఇన్‌చార్జి శావల దేవదత్‌

తిరువూరు, డిసెంబరు 26: రాష్ట్రాభివృద్ధి, ప్రజల భవిష్యత్తుకు గ్యారెంటీ తెలుగుదేశం ప్రభుత్వం హాయంలోనే సాధ్యం అని, చంద్రబాబు ప్రకటించిన భవిష్యతు గ్యారెంటీ సూపర్‌సిక్స్‌ పథకాల అమలు ప్రజలకు బంగారు భవిష్యత్‌ను అందిస్తుందని టీడీపీ నియోజకవర్గం ఇన్‌చార్జి శావల దేవదత్‌ అన్నారు. మంగళవారం పట్టణంలోని 1వ వార్డు 83వ పోలింగ్‌ బూత్‌ పరిధిలో భవిష్యత్తు గ్యారెంటి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులోని ఇంటింటికి వెళ్లి టీడీపీ సూపర్‌సిక్స్‌ పథకాలు వివరించడంతో పాటుగా ఒక్కొక్క కుంటుంబానికి అందించే లబ్ధి వివరించడంతో డిజిటల్‌ కార్డు జారీ నిమిత్తం ఆయా కుటుంబాల వివరాల నమోదు చేశారు. యూనిట్‌ ఇన్‌చార్జి డాక్టర్‌ సూరపనేని జయసింహా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు బొమ్మసాని మహేష్‌, ప్రధాన కార్యదర్శి సింధు శ్రీను, బూత్‌ కన్వీనర్‌ మోదుగు వెంకటేశ్వరరావు, విశ్వనాధుని మాధవాచారి, మస్తాన్‌, కృష్ణ, రాంబాబు, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

రెడ్డిగూడెం: మిట్టగూడెం సెంటర్లో బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో టీడీపీ రెడ్డిగూడెం మండల పార్టీ అధ్యక్షుడు ముప్పిడి నాగేశ్వర రెడ్డి పాల్గొని ప్రజలకు సూపర్‌ సిక్స్‌ పథకాల కర పత్రాలను పంచారు. చాట్ల చందా, నరెడ్ల చెన్నారెడ్డి, ఉయ్యూరు బొర్రా రెడ్డి, ఉయ్యూరు కాంతా రెడ్డి, రత్తా రెడ్డి, పోతురాజు బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 27 , 2023 | 12:44 AM