చీకటి జీవో రద్దు చేయాలి

ABN , First Publish Date - 2023-01-07T01:07:25+05:30 IST

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్న జీవోనెం 1ని రద్దు చేయాలని బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కన్నెకంటి జీవరత్నం డిమాండ్‌ చేశారు.

చీకటి జీవో రద్దు చేయాలి
కోర్టు ఆవరణలో న్యాయవాదుల నిరసన

నందిగామ, జనవరి 6: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్న జీవోనెం 1ని రద్దు చేయాలని బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కన్నెకంటి జీవరత్నం డిమాండ్‌ చేశారు. కోర్డు ఆవరణలో న్యాయవాదులు శుక్రవారం ఆందోళన చేశారు. కన్నెకంటి మాట్లాడుతూ, ఇటువంటి చీకటి జీవోల వల్ల ప్రజల స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుందన్నారు. కార్యక్రమంలో పెద్దయెత్తున న్యాయవాదులు పాల్గొన్నారు.

అధికార పార్టీకి వర్తించవా?

జి.కొండూరు : జీవో నంబరు 1అధికార పార్టీ నేతలకు వర్తించవా అని టీడీపీ సీనియర్‌ నేత గరిమెళ్ల గోపాలరావు ప్రశ్నించారు. శుక్రవారం కవులూరులోని తన నివాసంలో విలేకర్లతో మాట్లాడుతూ మాజీ సీఎం చంద్రబాబు రోడ్‌ షోలకు వస్తున్న ప్రజాధరణ చూసి ఓర్వలేక, లోకేశ్‌ చేయనున్న యువగళం పాదయాత్రను అడ్డుకునే కుట్రతోనే గుంటూరు, కందుకూరు దుర్ఘటనలను సాకుగా చూసి చీకటి జీవోలు తీసుకువచ్చారన్నారు. రాష్ట్రంలో ఒక నియంత పాలన కొనసాగుతుందన్నారు. చంద్రబాబు అధికారంలోకి రావడం ఖాయమనే జగన్‌ ఇలాంటి చర్యలకు పూనుకుంటున్నారన్నారు.

Updated Date - 2023-01-07T01:07:27+05:30 IST