ఇచ్చిన హామీ నిలబెట్టుకోని సీఎం

ABN , First Publish Date - 2023-09-23T00:24:42+05:30 IST

అసెంబ్లీలో మున్సిపల్‌ కార్మికుల సమస్యలపై చర్చించి తమ సమస్యలు పరిష్కారించాలంటూ కార్మికులు శుక్రవారం ధర్నా నిర్వహించారు.

ఇచ్చిన హామీ నిలబెట్టుకోని సీఎం
మున్సిపల్‌ కార్యాలయం వద్ద కార్మికుల ధర్నా

తిరువూరు, సెప్టెంబరు 22: అసెంబ్లీలో మున్సిపల్‌ కార్మికుల సమస్యలపై చర్చించి తమ సమస్యలు పరిష్కారించాలంటూ కార్మికులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌, కార్మికుల ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌(సీఐటీయూ)ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మట్లాడుతూ జగన్‌ తన పాదయాత్ర సమయంలో మున్సిపల్‌ కార్మికులు, కాంట్రాక్టు ఔట్‌సోర్పింగ్‌ కార్మికులను పర్మినెంట్‌ చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లకు పైగా అవుతున్నా తమ సమస్యలు పట్టించుకోవటం లేదని విమర్శించారు. ఈనెల 25న విజయవాడలో తలపెట్టిన ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు నాగరాజు, నరసరావు, వెంకటరమణ, కృష్ణవేణి, శ్రీను, సిఐటియు మండల కార్యదర్శి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-23T00:24:42+05:30 IST