రామాలయం కమిటీ లెక్కల్లో తిరకాసు

ABN , First Publish Date - 2023-03-19T00:57:29+05:30 IST

రాణిగారితోటలోని రామాలయంలో లెక్కల్లో బొక్కలు చూపిస్తున్నారని శ్రీరాముని సాక్షిగా కమిటీలోని వారే వివాదానికి దిగి న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

రామాలయం కమిటీ లెక్కల్లో తిరకాసు

రాణిగారితోట : రాణిగారితోటలోని రామాలయంలో లెక్కల్లో బొక్కలు చూపిస్తున్నారని శ్రీరాముని సాక్షిగా కమిటీలోని వారే వివాదానికి దిగి న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుమారు 40ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయంలోని శ్రీ రా ముడంటే ఈ ప్రాంత వాసులకు ఎంతో ప్రీతి, ప్రతి ఏడాది భక్తిశ్రద్ధలతో శ్రీరాముని కల్యాణం నిర్వహిస్తారు. ముఖ్యంగా ఈ ఆలయంలో కల్యాణం చేసుకుంటే మంచి జరుగుతుందనే నమ్మకంతో స్థానికుల్లో ఎక్కువమంది ఇక్కడే పెళ్లిళ్లు జరుపుకుంటారు. దీం తో ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ వస్తోం ది. అయితే కమిటీ సభ్యుల్లో ఇద్దరు, ముగ్గురు ఆలయాన్ని గుప్పెట్టో పెట్టుకుని వచ్చే ఆదాయానికి, చేస్తున్న ఖర్చులకు పొంతన లేకుండా వ్యవహరిస్తున్నారని, అడిగినవారిపై ఎదరుదాడులకు దిగుతున్నారనే ఆరోపణలున్నాయి. దీనిపై గత ఆదివారం శ్రీ రా ముని సాక్షిగా ఆలయ ప్రాంగణంలో లెక్కలపై కమి టీ సభ్యుల నడుమ వివాదం జరిగినట్టు తెలిసింది. యథారాజా తథా ప్రజా అన్న చందాన గత కమిటీ సభ్యులు మాదిరి ఈ కమిటీ సభ్యలు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. నాలుగేళ్ల క్రితం అప్పటి కమిటీ అవకతవకలను ఆంధ్రజ్యోతి వెలుగులోకి తేవడంతో ఆ కమిటీ రద్దయి నూతన కమిటీ ఏర్పడింది. అప్పటి నుంచి వైసీపీకి చెందిన కొందరు అధ్యక్ష, కార్యదర్శులుగా వ్వవహరిస్తూ ఆలయాన్ని నడిపిస్తున్నారు. కమిటీ ఏర్పడిన సమయంలో గత కమిటీ చేసిన తప్పిదాలు ఇక జరగవని ప్రతి 3 నెలలకు కమిటీ సమావేశం నిర్వహించి లెక్కలు చూ పడం జరుగుతుందని చెప్పినా ఇప్పటి వరకు అలా జరిగిన దాఖలాలు లేవని కమిటీ సభ్యులు చెబుతున్నారు. ఈ వివాదాల నేపథ్యంలో నాలుగేళ్ల నుంచి జరిగిన లెక్కలు బయటపెట్టాలని, దాదాపు రూ.2లక్షలకు లెక్కలు లేవని దానిపై ఈ వివాదం జరిగినట్లు సమాచారం. అయితే విషయాన్ని కమిటీ సభ్యులు గట్టుచప్పుడు కాకుండా తొక్కిపెట్టినట్లు తెలిసింది.

కమిటీలో సభ్యత్వం లేని వారిదే హవా!

ఈ ఆలయం నిర్మించినప్పుడు 150మందికి పైగా శాశ్వత సభ్యలున్నారు. వీరిలోనే అధ్యక్ష, కార్యదర్శులు గా వ్యవహరించేవారు. ప్రస్తుతం ఉన్నవారికి శాశ్వత సభ్యులుగా లేకపోయినా అధికార పార్టీని అడ్డుపెట్టుకుని పదవులు పొందారని శాశ్వత సభ్యులు ఆరోపిస్తున్నారు. అలాగే ఆలయానికి ఎటువంటి బ్యాంక్‌ అకౌంటు లేకుండా చేతిరాతల్లోనే లెక్కలు చూపుతున్నారని, గత కమిటీ ఉన్న సమయంలో ఉన్న బ్యాంక్‌ అకౌంటు గురించి పట్టించుకోవడం లేదని, అందులో కొంతనగదు కూడా ఉందని కమిటీ సభ్యులు చెబుతున్నారు. స్వామివారికున్న వెండి నగలు, ఇతర వెండి సామగ్రి కమిటీలోని ఒక సభ్యుడి ఇంటిలో ఉంచి అవసరం వచ్చినపుడు తెస్తున్నారని, అలా కాకుండా బ్యాంక్‌ లాకర్‌ ఉంచితే మంచిదనే వాదన వినిపిస్తుంది. వెంటనే ఆలయ కమిటీ సమావేశం జరిపి లెక్కలు చూపాలని కమిటీలోని ఇతర సభ్యులు డిమాండ్‌ చేస్తుండగా కమిటీలోని అధ్యక్ష, కార్యదర్శులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Updated Date - 2023-03-19T00:57:29+05:30 IST