హనుమాయమ్మ హత్య నిందితులను అరెస్ట్ చేయాలి
ABN , First Publish Date - 2023-06-07T01:05:53+05:30 IST
అక్కాచెల్లెళ్ల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని చెబుతున్న సీఎం జగన్మోహనరెడ్డి అంగన్వాడీ కార్యకర్త దారుణ హత్యపై స్పం దించకపోవడం దారుణమని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్ సుప్రజ అన్నారు.
గవర్నర్‌పేట, జూన్ 6 : అక్కాచెల్లెళ్ల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని చెబుతున్న సీఎం జగన్మోహనరెడ్డి అంగన్వాడీ కార్యకర్త దారుణ హత్యపై స్పం దించకపోవడం దారుణమని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్ సుప్రజ అన్నారు. హనుమాయమ్మను హత్య చేసిన వైసీపీ నేత కొండలరావును వెంటనే అరెస్ట్ చే యాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్ప ర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి అంగన్వాడీలు లెనిన్ సెంటర్‌లో నిరసన ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా సుప్రజ మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలపై హింస, వేధింపులు, అ త్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయని, ప్రకాశం జిల్లా రాయవారిపాలెంలో వైసీపీ నేత కొండలరావు ట్రాక్టర్‌తో తొక్కించి హనుమాయమ్మను హత్యచేశారని, 24 గంటలు గడుస్తున్నా హంతకుడ్ని పోలీసు లు అరెస్టు చేయలేదన్నారు. నిందితుడ్ని కఠినంగా శి క్షించడంతో పాటు హనుమాయమ్మ కుటుంబానికి రూ.50 లక్షలు నష్టపరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు డీవీ కృష్ణ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం లో మహిళలపై వేధింపులు పెరిగాయని, హింసను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డి మాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌సీహెచ్ శ్రీనివాస్, సెంట్రల్ సిటీ ప్రధాన కార్యదర్శి ఎంవీ సుధాకర్, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ ఏ కమల, అంగన్వాడీ యూనియన్ అధ్యక్షురాలు గజలక్ష్మీ, నేతలు జైనీ రత్నకుమారి, కళ్యాణి, శైలజ, పద్మావతి, అరుణ పాల్గొన్నారు.