ధన్యజీవి.. జోసఫ్‌ తంబి

ABN , First Publish Date - 2023-01-15T00:58:38+05:30 IST

క్రీస్తు మార్గంలో నడుస్తూ, తన జీవితాన్ని సార్థకం చేసుకున్న ధన్యజీవి, భక్తుల కోర్కెలను తీర్చే గొప్ప భక్తుడు బ్రదర్‌ జోసఫ్‌ తంబి అని నిడదవోలు హెచ్‌జీఎన్‌ ప్రొవిన్షియల్‌ రెవరెండ్‌ ఫాదర్‌ బత్తుల జయరాజు పేర్కొన్నారు.

ధన్యజీవి.. జోసఫ్‌ తంబి
సమష్టి దివ్యబలిపూజల్లో పాల్గొన్న మతగురువులు

రెండో రోజు ఉత్సవాల్లో ప్రత్యేక ప్రార్థనలు

ఉంగుటూరు, జనవరి 14: క్రీస్తు మార్గంలో నడుస్తూ, తన జీవితాన్ని సార్థకం చేసుకున్న ధన్యజీవి, భక్తుల కోర్కెలను తీర్చే గొప్ప భక్తుడు బ్రదర్‌ జోసఫ్‌ తంబి అని నిడదవోలు హెచ్‌జీఎన్‌ ప్రొవిన్షియల్‌ రెవరెండ్‌ ఫాదర్‌ బత్తుల జయరాజు పేర్కొన్నారు. పెద అవుటపల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహిస్తున్న దైవసేవకుడు బ్రదర్‌ జోసఫ్‌ తంబి వర్ధంతి మహోత్సవాలు(తిరునాళ్లు) శనివారం రెండో రోజుకు చేరాయి. మతగురువుల ప్రత్యేక ప్రార్థనలు గాయకబృందం ఆలపిస్తున్న స్తుతిగీతాలతో తంబి పుణ్యక్షేత్రం మార్మోగింది. నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్ధర్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి తంబి పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. గురువుల సమక్షంలో తంబి సమాధివద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఫాదర్‌ జయరాజు సమర్పించిన సమష్టి దివ్యబలిపూజలో పాల్గొన్నారు. పుణ్యక్షేత్రం రెక్టర్‌ రెవరెండ్‌ ఫాదర్‌ సుధాకర్‌ లారెన్స్‌ మాట్లాడుతూ మతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ దర్శించుకునే గొప్ప మహిమాన్విత క్షేత్రంగా తంబి పుణ్యక్షేత్రం విరాజిల్లుతోందన్నారు. సాయంత్రం శ్రీకాకుళం పీఠాధిపతులు రైట్‌ రెవరెండ్‌ శ్రీరాయల విజయ్‌కుమార్‌ సమష్టి దివ్యబలిపూజ సమర్పించారు.

Updated Date - 2023-01-15T00:58:39+05:30 IST