Share News

తగ్గని ముంపు

ABN , First Publish Date - 2023-12-11T01:27:27+05:30 IST

తుఫాన్‌ ప్రభావంతో కురిసిన వర్షాలకు మునిగిన పొలాల నుంచి ఇప్పటి వరకు నీరు తగ్గకపోవడంతో వరి పనలు, వరిపంట మురిగి పోతున్న పరిస్థితుల్లో రైతులు ఆందోళన చెందుతు న్నారు. వర్షాలు తగ్గి నాలుగు రోజులు దాటినా మండ ల పరిధి పలు గ్రామాల పొలాల్లో ఇంతవరకు నీరు బటయకు పోక కొన్నిచోట్ల ధాన్యం నుంచి మొలకలు, మరి కొన్ని ప్రాంతాల్లో కోత కోసేందుకు వీలులేకుండా పంట నీటిలో మునిగి ఉంది.

 తగ్గని ముంపు
కడవకొల్లులో నీటి లో నాని మురిగిపోతున్న వరి పనలు

ఫ వర్షాలు తగ్గి నాలుగు రోజులైనా

నీళ్లలోనే వరి పనలు

ఫ ధాన్యం మొలకలతో రైతుల్లో నిరాశ

ఫ ఆర్బీకేలు నిరుపయోగమంటూ ఆగ్రహం

ఫ ప్రభుత్వం, అధికారుల హామీలే తప్ప ఆదుకోవట్లేదని ఆవేదన

ఫ డ్రెయినేజీ వ్యవస్థ తీరుపై మండిపాటు

ఉయ్యూరు / హనుమాన్‌జంక్షన్‌రూరల్‌, డిసెంబరు 10 : తుఫాన్‌ ప్రభావంతో కురిసిన వర్షాలకు మునిగిన పొలాల నుంచి ఇప్పటి వరకు నీరు తగ్గకపోవడంతో వరి పనలు, వరిపంట మురిగి పోతున్న పరిస్థితుల్లో రైతులు ఆందోళన చెందుతు న్నారు. వర్షాలు తగ్గి నాలుగు రోజులు దాటినా మండ ల పరిధి పలు గ్రామాల పొలాల్లో ఇంతవరకు నీరు బటయకు పోక కొన్నిచోట్ల ధాన్యం నుంచి మొలకలు, మరి కొన్ని ప్రాంతాల్లో కోత కోసేందుకు వీలులేకుండా పంట నీటిలో మునిగి ఉంది. ముదునూరు, బోళ్ల పాడు, కాటూరు, కడవకొల్లులో పొలాల్లో నీటిలో ఉన్న వరిపనలు మురిగిపోయి పనికిరాకుండా పోతుంది. ఆరుగాలం కష్టపడి వేల రూపాయలు ఖర్చు చేసి పండించిన పంట చేతి కొస్తున్న తరుణంలో తుఫాను తీవ్రనష్టం కలుగు జేసిందని, ప్రభుత్వం ధాన్యమంతా కొనుగోలుచేసి ఆదుకోకపోతే ఆత్మహ త్యలే శరణ్యమని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బాపులపాడు మండలంలో..

తుఫాన్‌ వెళ్లిపోయి రోజులు గడుస్తున్నా ఇంకా వరిపొలాల్లో నీరు పోలేదంటే సాగునీటి శాఖ అధికా రుల నిర్లక్ష్యంకళ్లకు కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ప్రభుత్వ ప్రకటనలకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులకు పొంతనలేకుండా ఉందంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు ధాన్యం తోలేందుకు సరిపడిన సంచులుగానీ, హమాలీ వ్యవస్థ గానీ అందుబాటులో లేదని రైతులు చెబుతున్నారు. ఇక కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఎకరానికి సుమారు రూ.60 వేలకు పైగా కౌలు చెల్లించి, పెట్టుబడులు పెట్టిన రైతులు ధాన్యం చేతికి వస్తుందనే నమ్మకాన్ని కోల్పోతున్నారు. రైతుకు భరోసా ఇస్తామంటూ ప్రచారార్భాంటం చేస్తున్న ప్రభుత్వం కనీసం ఆర్బీకేల్లో మొలకెత్తిన ధాన్యాన్ని ఏవిధంగా కొనాలో తెలియ జేయకపోవడంతో రైతుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవు తున్నాయి. అధికారుల నిర్లక్ష్య ఫలితంగా వరి పండించిన రైతు గత కొన్ని సం వత్సరాలుగా సాగునీటితో మొదలవుతున్న కష్టాలు, పంట అమ్మడం, వర్షాలతో మొలకెత్తిన ధాన్యం కొన డం వరకు అన్నిరకాలుగా ఆటుపోట్లను ఎదుర్కొంటూ కుదేలవుతున్నారు. గత సంవత్సరం పంట కొనుగోలు చేసిన తర్వాత నగదు జమచేయడంలో తీవ్ర అలక్ష్యం కారణంగా రైతులు రోడ్డెక్కితే, ఈ సంవత్సరం మొల కెత్తిన ధాన్యాన్ని కొనాలని రోడ్డెక్కాల్సిన పరిస్థితి. తేమశాతంలో తప్పులు, ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం తదితర కారణాలతో ఆర్బీకేలంటేనే రైతులు భయప డేపరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలోనే పరిస్థితే బాగుందని, ఆర్బీకేల వల్ల ఉపయోగం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బాపులపాడు మండలంలోని వీరవల్లి, తిప్పన గుంట, ఆరుగొలను, దంటగుంట్ల, రంగయ్య ప్పారా వుపేట తదితర గ్రామాల్లో వర్షాలు పోయి రోజులు గడుస్తున్నా వరిపొలాల్లో నీరు ఇంకా అలాగే ఉంది. పడిపోయిన వరిపైరు నీటిలో నానుతూ మొలకలు వస్తున్నాయి. కొంతమంది రైతులు పంటను వదిలేసి ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తుండగా, మరి కొందరు రైతుల తప్పని పరిస్థితుల్లో మోటార్లుపెట్టి వరిచేలోని నీటిని తోడుకుంటున్నారు. కాలువల ఆక్రమణలకు తోడు కాలువలు బాగుచేయకుండా వదిలివేసిన సాగునీటిశాఖ నిర్లక్ష్యం వల్లే వరిపంట మునిగిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-12-11T01:27:29+05:30 IST