పాఠ్యపుస్తకాలు ఉచితంగా ఇవ్వాలి

ABN , First Publish Date - 2023-06-27T00:55:27+05:30 IST

ఇంటర్‌ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించాలని, అధ్యాపకుల్ని పూర్తిస్థాయిలో భర్తీ చేయాలని ఎస్‌ఎ్‌ఫఐ అధ్యక్ష, కార్యదర్శులు ఎం.సోమేశ్వరరావు, సి.హెచ్‌ వెంకటేశ్వరరావు డిమాండ్‌ చేశారు.

పాఠ్యపుస్తకాలు ఉచితంగా ఇవ్వాలి

విజయవాడ/కలెక్టరేట్‌, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): ఇంటర్‌ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించాలని, అధ్యాపకుల్ని పూర్తిస్థాయిలో భర్తీ చేయాలని ఎస్‌ఎ్‌ఫఐ అధ్యక్ష, కార్యదర్శులు ఎం.సోమేశ్వరరావు, సి.హెచ్‌ వెంకటేశ్వరరావు డిమాండ్‌ చేశారు. సోమవారం కలెక్టర్‌ కార్యాలయం వద్ద ఎస్‌ఎ్‌ఫఐ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. అనంతరం జాయింట్‌ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ కళాశాలల్లో కనీస వసతు సదుపాయాలు కల్పించాలని, విద్యార్థులకు మంచినీటిని అందించాలన్నారు. గత ప్రభుత్వం ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందించిందని, నేటి ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు ఇవ్వడంలో అలసత్వం ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. అమ్మఒడి ఒక్కరికి మాత్రమే వస్తుందని, గతంలో స్కాలర్షిప్‌ పథకం ఉన్నప్పుడు ఇంట్లో ఎంతమంది ఉన్నా అందరికీ వచ్చేదని గుర్తుచేశారు. ప్రభుత్వం ఏటా అడ్మిషన్‌, పరీక్ష ఫీజులు 10 శాతం పెంచి విద్యార్థులపై భారాలు మోపుతుందని దుయ్యబట్టారు. తక్షణమే పెంచిన ఫీజులు తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా కమిటీ సభ్యులు కుమారస్వామి, నగర కమిటీ సభ్యులు భార్గవ్‌, రాజకుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-06-27T00:55:27+05:30 IST