దుర్గగుడి అన్నదాన విభాగం క్లీనింగ్ సిబ్బందికి వేతనాలు లేక వెతలు
ABN , First Publish Date - 2023-03-05T00:34:38+05:30 IST
దుర్గగుడి కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్‌లో పలు విభాగాల్లో పనిచేస్తు న్న సిబ్బందికి మూడు నెలలుగా వేతనాలివ్వ డం లేదని చెబుతున్నారు.
వన్‌టౌన్, మార్చి 4 : దుర్గగుడి కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్‌లో పలు విభాగాల్లో పనిచేస్తు న్న సిబ్బందికి మూడు నెలలుగా వేతనాలివ్వ డం లేదని చెబుతున్నారు. వీరంతా ఇంజనీరిం గ్, వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు. నెలకు ఒక్కొక్కరికి రూ.10వేల వేతనం ఇస్తున్నారు. కానీ మూడు నెలలుగా వేతనాలివ్వడం లేదు. దీంతో వీరంతా కుటుంబాలు గడవడం కోసం బయటి నుంచి వడ్డీలకు రుణాలు తెచ్చుకుంటున్న పరిస్థితి. ముఖ్యంగా ఆడిట్ విభాగంలో బిల్లులను నెలలతరబడి పెండింగులో ఉంచుతున్నట్టు చెబుతున్నారు. ఆలయంలో ఆర్థికపరమైన ఏ లావాదేవీకైనా ఆడిట్ ఆమోదం ఉం డాలి. దీంతో అక్కడకు వెళ్లిన బిల్లులు బయటకు రావట్లేదు. ఆడిట్ విభాగానికి ముడుపు లు చెల్లించలేదన్న కారణంతో పెండింగులో ఉ న్నట్టు చెబుతున్నారు. ముఖ్యంగా కాంట్రాక్టర్ల కూ బిల్లులు రాని పరిస్థితి. తాము బయటి నుంచి డబ్బులు తెచ్చిచ్చే పరిస్థితి ఉన్నా, ఏదో ఒకటి రెండు నెలలకు ఇవ్వగలం గానీ, కంటిన్యూగా 3, 4 నెలలు బిల్లులు పెండింగులో ఉంటే ఇవ్వలేమని కాంట్రాక్టర్లు చెబుతున్నారు.
కోర్టుకు వెళ్లే యోచన
దుర్గగుడిలో పారిశుద్ధ్య కాంట్రాక్ట్‌ను తామే నిర్వహించేలా కొందరు సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. టెండర్లు పిలవడం, ఎవరో కాంట్రాక్ట్ పాడుకోవడం, వారంతా సరి గా నిర్వహించకపోవడం, సిబ్బందికి తక్కువ వేతనాలివ్వడం, తక్కువ మంది సిబ్బందితో న డిపించడం, విమర్శలు రావడం వంటి కారణాలతో దేవస్థానమే నిర్వహించుకుంటే ఆదాయం ఉంటుందన్న భావన వ్యక్తమవుతోంది. తాజా గా పిలిచిన టెండర్లలో హైదారాబాద్‌కు చెంది న ఒక కాంట్రాక్టర్ టెండర్‌ను దక్కించుకుంటున్నారు. సిబ్బందిలో ఈశ్వరమ్మ, వాసు, దుర్గారావు, భాగ్యలక్ష్మి, వెంకట లక్ష్మి అనే ఐదుగురు ఒక గ్రూపుగా ఏర్పడి కోర్టులో దావా వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో సిబ్బంది ఒక్కొక్కరు రూ.3వేల చొప్పున కోర్టు ఖర్చులకు వసూలు చేస్తున్నట్లు సమాచారం.