సీటెట్‌ పరీక్ష నిర్వహణలో సాంకేతిక లోపం!

ABN , First Publish Date - 2023-01-25T00:55:44+05:30 IST

కేంద్ర ఉపాధ్యాయ అర్హత పరీక్షలో సర్వర్‌ మొరాయించడంతో అభ్యర్థులు గందరగోళానికి గురయ్యారు. నిర్వాహకులు సమస్య పరిష్కరించకపోవడంతో అఽభ్యర్థులు ఆందోళనకు దిగారు.

సీటెట్‌ పరీక్ష నిర్వహణలో  సాంకేతిక లోపం!
ఆందోళన చేస్తున్న అభ్యర్థులు

పెనమలూరు, జనవరి 24 : కేంద్ర ఉపాధ్యాయ అర్హత పరీక్షలో సర్వర్‌ మొరాయించడంతో అభ్యర్థులు గందరగోళానికి గురయ్యారు. నిర్వాహకులు సమస్య పరిష్కరించకపోవడంతో అఽభ్యర్థులు ఆందోళనకు దిగారు. వంద అడుగుల రోడ్డులోని శైలేష్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ప్రైవేటు లిమిటెడ్‌ పరీక్షా కేంద్రం నిర్వాహకులు ఉన్నతాధికారులను సంప్రదించగా సాంకేతిక సమస్యలతో సర్వర్‌ లోపం వల్ల పరీక్ష రాయలేకపోయిన అభ్యర్థులకు తిరిగి పరీక్ష నిర్వహిస్తామని, పరీక్ష తేదీని, కేంద్రాన్ని అభ్యర్థులకు తెలియపరుస్తామని తెలపడంతో వారు ఆందోళన విరమించారు.

Updated Date - 2023-01-25T00:55:44+05:30 IST