టీడీపీ విజయోత్సవం

ABN , First Publish Date - 2023-03-19T00:48:56+05:30 IST

ట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించిన నేపథ్యంలో అవనిగడ్డ ప్రధాన సెంటర్‌లో టపాసులు కాల్చి సంబరాలు నిర్వహించారు.

 టీడీపీ విజయోత్సవం
కోడూరులో కేక్‌ కట్‌ చేసి సంబరాలు

అవనిగడ్డ టౌన్‌, మార్చి 18 : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించిన నేపథ్యంలో అవనిగడ్డ ప్రధాన సెంటర్‌లో టపాసులు కాల్చి సంబరాలు నిర్వహించారు. నియోజకవర్గ టీడీపీ అధికార ప్రతినిధి కొల్లూరి వెంకటేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షుడుయాసం చిట్టిబాబుల ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి పంపిణీ చేశారు. టీడీపీ నాయకులు కొల్లూరి వెంకటేశ్వరరావు, బండే శ్రీనివాసరావు, బావిరెడ్డి వెంకటేశ్వరరావు, బండే రాఘవ, మొ గల్‌ మురాద్‌, మండలి ఉదయభాస్కర్‌, కర్రా సుధాకర్‌, యలవర్తి చిన్నా, విశ్వనాథుని మురళీ, షేక్‌ బాబావలి, మెగావత్‌ గోపి, తోట సాయి, గుడివాక నరహరి తదితరులు పాల్గొన్నారు. మోపిదేవి : శాసన మండలి పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందటంతో టీడీపీ శ్రేణులు విజయోత్సవం జరిపారు. టీడీపీ కార్యాలయం వద్ద కేక్‌ కట్‌ చేసి మిఠాయిలు పంచారు. మండల టీడీపీ అధ్యక్షులు నడకదుటి జనార్థనరావు, ఎస్సీ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు పొలిమేట్ల ఏసుబాబు, మండల తెలుగుయువత అధ్యక్షులు విస్సంశెట్టి రాజా, తెలుగుయువత రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి రావి రత్నగిరి, ఎంపిటిసి సభ్యులు కొమ్ము పవన్‌, వైస్‌ ఎంపీపీ కడవకొల్లు సీతారామాంజనేయులు, పార్టీ నాయకులు మురాల సుబ్బారావు, శివరామకృష్ణ, కావూరి రామకృష్ణ, మాతంగి జనార్థన్‌, కనకయ్య, పుల్లారావు, సీతారామప్రసాద్‌ తదితరులు ఉన్నారు. కోడూరు : పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించటంతో మండల టీడీపీ నేతలు కోడూరులో విజయోత్సవం నిర్వహించారు. కోడూరు ప్రధాన సెంటర్‌లో శనివారం పెద్ద ఎత్తున టపాసులు కాల్చి కేక్‌ కట్‌ చేసి మిఠాయిలు పంచారు. మండల టీడీపీ అధ్యక్షులు బండే శ్రీనివాసరావు, కాగిత రామారావు, బడే గాంధీ, జరుగు వెంకటేశ్వరరావు, బొలిశెట్టి విఠల్‌ రావు, అప్పికట్ల రవీంద్ర, బొడ్డు వెంకన్న, బడే పిచ్చియ్య, ఉప్పాల పోతురాజు, దావు చిన్నబాబు, మేకా రమేష్‌, టీడీపీ అభిమానులు పాల్గొన్నారు. పమిడిముక్కల: పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల్లో టీడీపీ విజయం నేపథ్యంలో మం డలంలోని లంకపల్లి గ్రామంలో ఘంటా సురేష్‌ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. తాడికొండ చిన్నా, గాజుల శ్రీను, వేమూరి సాయిబాబు, అంజయ్య, సీతయ్య, చెన్నకేశవులు, సురేష్‌ తదతరులు పాల్గొన్నారు. తోట్లవల్లూరు : ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో వైసీపీ పతనం మొదలయిందని మండల టీడీపీ అధ్యక్షుడు వీరపనేని శివరామ్‌ప్రసాద్‌ అన్నారు. మూడు ఎమ్మెల్సీ స్థానాలను టీడీపీ కైవసం చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని శనివారం రాత్రి పెనమకూరులో శివరామ్‌ ఆధ్వర్యంలో విజయోత్సవం నిర్వహించారు. బాణాసంచాకాల్చి, స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు. ఉప సర్పంచ్‌ వీరంకి పరశురామ్‌, మాజీ వైస్‌ ఎంపీపీ వీరంకి వరహాలరావు, మాజీ సర్పంచ్‌ పిట్టు వెంకటేశ్వరరావు, నాయకులు కొల్లి శ్రీనివాసరెడ్డి, మొవ్వ శేషగిరిరావు, మట్టా అమృతబాబు, గోళ్ల శివ, దేవరపల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. బంటుమిల్లి : ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలుపు మోసపూరిత వైసీపీకి చెంప పెట్టు అని పెడన నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కాగిత కృష్ణప్రసాద్‌ అన్నారు. మండల పార్టీ కన్వీనర్‌ కూనపెడ్డి వీరబాబు అధ్యక్షతన శనివారం విజయోత్సవం బంటుమిల్లిలో ఘనంగా జరిగింది. కేక్‌ కట్‌ చేసి, స్వీట్లు పంచారు.

Updated Date - 2023-03-19T00:48:56+05:30 IST