Share News

సైకో ప్రభుత్వాన్ని గద్దె దింపాలి

ABN , Publish Date - Dec 17 , 2023 | 12:54 AM

వచ్చే ఎన్నికల్లో సైకో ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, అమరావతి, పోలవరం లాంటి అనేక అంశాల్లో కోర్టులు, ప్రజలు, రాష్ట్ర బాగు కోరే ఎన్నో స్వచ్ఛంద సంస్థలు తప్పు పట్టినా తుగ్లక్‌ జగన్‌రెడ్డికి చీమకుట్టినట్లు కూడా లేదని, ఇలాంటి నియంతలకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమయిందని తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బోడె మనోజ్‌(సన్నీ) వ్యాఖ్యానించారు.

 సైకో ప్రభుత్వాన్ని గద్దె దింపాలి
తాడిగడపలో జరిగిన బాబు ష్యూరిటీ-భవిష్యత్‌ గ్యారెంటీ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బోడె మనోజ్‌

పెనమలూరు, డిసెంబరు 16 : వచ్చే ఎన్నికల్లో సైకో ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, అమరావతి, పోలవరం లాంటి అనేక అంశాల్లో కోర్టులు, ప్రజలు, రాష్ట్ర బాగు కోరే ఎన్నో స్వచ్ఛంద సంస్థలు తప్పు పట్టినా తుగ్లక్‌ జగన్‌రెడ్డికి చీమకుట్టినట్లు కూడా లేదని, ఇలాంటి నియంతలకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమయిందని తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బోడె మనోజ్‌(సన్నీ) వ్యాఖ్యానించారు. శనివారం తాడిగడప వసంత్‌నగర్‌ కట్ట 25వ డివిజన్‌లో జరిగిన భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో స్థానిక నాయకులతో కలిసి మనోజ్‌ ప్రజలతో మాట్లాడారు. కాల్వకట్టలపై తాము అధికారంలో ఉన్నప్పుడు మెరుగైన సౌకర్యాలు కల్పించామని, ప్రస్తుత ప్రభుత్వంలో కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రజా ప్రతినిధులు ఘోరంగా విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లు, మురుగు కాల్వల నిర్వహణ కూడా చేయ లేని స్థితిలో సైకో ప్రభుత్వం ఉండడం సిగ్గుచేటని పేర్కొన్నారు. రాజమండ్రి మహానాడు మేనిఫెస్టోలో చంద్రబాబు ప్రకటించిన హామీలను ప్రజలకు వివరిస్తూ ప్రతి కుటుంబానికి వచ్చే లబ్ధితో కూడిన బాండ్లను పంపిణీ చేశారు. వచ్చే ఎన్నికల్లో పెనమలూరు ఎమ్మెల్యేగా బోడె ప్రసాద్‌ను, రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబును ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ స్థానిక నాయకులు తుమ్మల రాంకుమార్‌, పీతా గోపి, సాదిక్‌, నాగుల్‌ మీరా, సరిహద్దు కోటేశ్వరరావు, మేడసాని రత్నకుమారి, షకీలా, మొక్కపాటి దామోదర్‌, కొండ్రు కోటేశ్వరరావు, పీతా శ్రీనివాసరావు, వడుగు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

అధికారంలోకి రానున్నది టీడీపీ, జనసేన కూటమి

కంకిపాడు : రానున్న సార్వత్రిక ఎన్ని కల్లో టీడీపీ, జనసేన కూటమి అధికారం లోకి వస్తుందని టీడీపీ సీనియర్‌ నాయకు లు తుమ్మలపల్లి హరికృష్ణ అన్నారు. కంకిపాడు 175వ బూత్‌లో శని వారం నిర్వహించిన బాబు ష్యూరిటీ- భవిష్యత్‌ గ్యారెంటీ కార్యక్రమంలో ఆయన మాట్లాడు తూ, చంద్రబాబు నాయుడు ప్రవేశ పెట్టిన మేనిఫెస్టోను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకు వెళ్లాల్సిన అవసరముందన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిం చడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. ఈ కార్యక్రమంలో యూనిట్‌ ఇన్‌చార్జి పులి శ్రీనివాసరావు, బూత్‌ కన్వీనర్లు కొండా నాగేశ్వరరావు, అన్నవరపు శివపార్వతి, పార్టీ నాయకులు ఏనుగ జయప్ర కాష్‌, షేక్‌ బాజి, షేక్‌ సలీం పాల్గొన్నారు.

Updated Date - Dec 17 , 2023 | 12:54 AM