Share News

ఆత్మీయ కలయికలో నాటి మధుర స్మృతులెన్నో..

ABN , First Publish Date - 2023-10-30T01:03:18+05:30 IST

ఒకే తరగతి గదిలో చదువుకుని, పరీక్షలు ముగిశాక పాఠశాలను వీడాక ఎ క్కడెక్కడో ఉన్నవారంతా కలుసుకోవడంలో ఉన్న ఆ నందం, అనుభూతి వర్ణనాతీతం.

ఆత్మీయ కలయికలో నాటి మధుర స్మృతులెన్నో..

వన్‌టౌన్‌, అక్టోబరు 29: ఒకే తరగతి గదిలో చదువుకుని, పరీక్షలు ముగిశాక పాఠశాలను వీడాక ఎ క్కడెక్కడో ఉన్నవారంతా కలుసుకోవడంలో ఉన్న ఆ నందం, అనుభూతి వర్ణనాతీతం. నగరంలోని సత్యనారాయణపురంలో శిశు విద్యా మందిర్‌లో చదువుకున్న 1982-1983 బ్యాచ్‌ ఆదివారం గాంధీనగర్‌లో కుబేర హోటల్‌లో కలుసుకున్నారు. తమ జ్ఞాపకాలను పంచుకున్నా రు. తమ తరగతి గదిలో జరిగిన కొన్ని మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. నాటి ఉపాధ్యాయులు తమకు నేర్పిన సద్గుణాలను గుర్తు చేసుకుని గురువందనం చేశారు. ఓవర్సీస్‌ నుంచి వచ్చిన తంగిరాల రఘరామ్‌, శ్రీనివాస సాయిష్‌, పూర్వ విద్యార్థి కే ప్ర శాంత్‌ కుమార్తె భువన, పింగళి రామారావు పాటలు, పద్యాలు పాడారు. జోకులు వినిపించారు. దుబాయ్‌ నుంచి వచ్చిన మద్దుల మనోజ్‌కుమా ర్‌, సౌదీ నుంచి ఎం చంద్రశేఖర్‌ ఈ సమ్మేళనం కోసం రావడం విశేషం.

Updated Date - 2023-10-30T01:03:18+05:30 IST