మండిన ఎండ

ABN , First Publish Date - 2023-06-03T00:50:30+05:30 IST

కొద్దిరోజులు ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పటికీ మళ్లీ భారీగా నమోదవుతున్నాయి.

మండిన ఎండ

వేడిగాలులు, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలు

విజయవాడ, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి) : కొద్దిరోజులు ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పటికీ మళ్లీ భారీగా నమోదవుతున్నాయి. ఉదయం నుంచి నమోదైన ఉష్ణోగ్రత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రాత్రి తొమ్మిది గంటల వరకు వేడిగాలులు వీస్తూనే ఉన్నాయి. ఈ పరిస్థితి శనివారం కూడా కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గుడ్లవల్లేరులో 44.6, పెనుగంచిప్రోలు, బాపులపాడు, మొవ్వలో 44.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కృష్ణాజిల్లాలోని అవనిగడ్డలో 41.8, బంటుమిల్లిలో 39.7, చల్లపల్లిలో 42.1, గన్నవరంలో 42.3, ఘంటసాలలో 43.7, గుడివాడలో 41.2, గూడూరులో 44.0, కంకిపాడులో 41.7, కోడూరులో 43.9, కృత్తివెన్నులో 40.5, మచిలీపట్నంలో 41.6, మోపిదేవిలో 42.2, నాగాయలంకలో 40.9, నందివాడలో 43.8, పామర్రులో 42.8, పమిడిముక్కలలో 42.0, పెడనలో 43.1, పెదపారుపూడిలో 43.2, పెనమలూరులో 43.7, తోట్లవల్లూరులో 43.3, ఉంగుటూరులో 43.5, ఉయ్యూరులో 42.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎన్టీఆర్‌ జిల్లాలోని ఎ.కొండూరులో 42.9, చందర్లపాడులో 43.5, జి.కొండూరులో 43.2, గంపలగూడెంలో 43.6, ఇబ్రహీంపట్నంలో 42.5, జగ్గయ్యపేటలో 42.3, కంచికచర్లలో 43.1, మైలవరంలో 42.9, నందిగామలో 43.9, రెడ్డిగూడెంలో 43.9, తిరువూరులో 40.3, వత్సవాయిలో 42.5, వీరులపాడులో 42.4, విజయవాడ రూరల్‌లో 42.6, విజయవాడ అర్బన్‌లో 42.9, విస్సన్నపేటలో 42.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

Updated Date - 2023-06-03T00:50:30+05:30 IST