Share News

యాసిడ్‌ తాడి వృద్ధుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2023-11-06T01:10:38+05:30 IST

కృష్ణలంక లాల్‌బహుదూర్‌వీధికి చెందిన మస్తానయ్య(60) ఆది వారం బాత్రూమ్‌లో ఉన్న యాసిడ్‌ను తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

యాసిడ్‌ తాడి వృద్ధుడి ఆత్మహత్య

వన్‌టౌన్‌: కృష్ణలంక లాల్‌బహుదూర్‌వీధికి చెందిన మస్తానయ్య(60) ఆది వారం బాత్రూమ్‌లో ఉన్న యాసిడ్‌ను తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని కుమారుడు కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మస్తానయ్య గతంలో ఆటోనగర్‌లో టింకరింగ్‌ పని చేస్తుండేవాడు. రెండేళ్ల క్రితం పక్షవాతం రావడంతో చికిత్స చేయిస్తున్నారు. ఆర్థిక పరిస్థితులు బాగోకపోవడంతో వైద్యానికి చాలా ఖర్చవుతోందన్న బాధపడేవాడు. కొడుకు, కూతురు తమ విధులకు వెళ్లిపోయాక బాత్రూమ్‌లో ఉన్న యాసిడ్‌ను తాగేశాడు. కుమారుడు మస్తానయ్యను జీజీహెచ్‌కు తరలించగా వైద్యులు చనిపోయినట్లు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే తన తండ్రి ఆత్మహత్య చేసు కున్నాడని కుమార్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

Updated Date - 2023-11-06T01:10:39+05:30 IST