విద్యార్థులు లక్ష్యంతో ముందుకు సాగాలి

ABN , First Publish Date - 2023-03-19T00:32:00+05:30 IST

పదోతరగతి విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని కేబీఎన్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వి.నారాయణరావు అన్నారు.

విద్యార్థులు లక్ష్యంతో ముందుకు సాగాలి
విద్యార్థులకు బహుమతులు అందజేస్తున్న ప్రిన్సిపాల్‌, అతిథులు

విద్యార్థులు లక్ష్యంతో ముందుకు సాగాలి

కేబీఎన్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ నారాయణరావు

వన్‌టౌన్‌, మార్చి 18: పదోతరగతి విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని కేబీఎన్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వి.నారాయణరావు అన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఇటీవల ప్రజ్ఞా వికాసంపేరిట నిర్వహించిన పరీక్షలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు శనివారం బహుమతి ప్రదానం కాలేజీ ఆవరణలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యారంగంలో వస్తున్న మార్పులపై అవగాహన కల్పించుకోవాలన్నారు. ఒక లక్ష్యంతో ముందుకు సాగాలన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ ఎన్‌టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు ఎం.సోమేశ్వరరావు, 50వ డివిజన్‌ కార్పొరేటర్‌ బోయ సత్యబాబులు మాట్లాడుతూ విద్యార్థులు నిరంతర సాధకులుగా ఉండాలని సూచించారు. గాంధీజీ మహిళా కళాశాల అధ్యాపకులు దుర్గాలక్ష్మీ, హిమబిందు, ఎస్‌ఎఫ్‌ఐ నగర అధ్యక్షుడు బాలు, ఎన్‌టీఆర్‌ జిల్లా కమిటీ సభ్యురాలు ఎస్‌కే జాహిదా, మాధవరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా విజేతలకు అతిథులు బహుమతులు పంపిణీ చేశారు.

Updated Date - 2023-03-19T00:32:00+05:30 IST