Share News

శాస్త్రీయ విద్యాసాధనకు విద్యార్థులు ఉద్యమించాలి

ABN , First Publish Date - 2023-12-11T00:53:09+05:30 IST

శాస్త్రీయ విద్యా సాధనకు, దోపిడీ, పీడన లేని సమాజ స్థాపనకు విద్యార్థులు ఉద్యమించాలని పీడీఎ్‌్‌సయూ జాతీయ కన్వీనర్‌ ఎం.రామకృష్ణ పిలుపునిచ్చారు.

శాస్త్రీయ విద్యాసాధనకు విద్యార్థులు ఉద్యమించాలి

పీడీఎ్‌్‌సయూ జాతీయ కన్వీనర్‌ రామకృష్ణ పిలుపు

మొగల్రాజపురం, డిసెంబరు 10: శాస్త్రీయ విద్యా సాధనకు, దోపిడీ, పీడన లేని సమాజ స్థాపనకు విద్యార్థులు ఉద్యమించాలని పీడీఎ్‌్‌సయూ జాతీయ కన్వీనర్‌ ఎం.రామకృష్ణ పిలుపునిచ్చారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(పీడీఎ్‌్‌సయూ) నగర 9వ మహాసభ ఆదివారం మొగల్రాజపురం చండ్ర రాజేశ్వరరావు గ్రంథాలయంలో జరిగింది. ముఖ్యవక్తగా పాల్గొన్న రామకృష్ణ మాట్లాడారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం విద్యారంగాన్ని మనువాద భావజాలంతో నింపడానికి నూతన జాతీయ విద్యావిధానం-2020 తీసుకొచ్చారన్నారు. పీడీఎ్‌్‌సయూ రాష్ట్ర అధ్యక్షుడు యు.గనిరాజు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు సమాజాన్నీ అర్థం చేసుకోవాలన్నారు. ఐఎ్‌ఫటీయూ నేతలు విఘ్నేష్‌ విప్లవ విద్యార్థి గీతాలు ఆలపించారు. పీడీఎ్‌్‌సయూ నగర నేతలు వేణు అధ్యక్షత వహించారు. తొలుత అమరులైన నేతలకు నివాళులర్పించారు. అనంతరం నగరాధ్యక్షులుగా వైష్ణవ్‌, కార్యదర్శిగా వేణు, మరో 9 మందితో కమిటీని ఏర్పాటు చేశారు. నేతలు అనూష, ఉదయ్‌, హాసిని, హరిణి, మణికంఠ, గురువిష్ణు, గౌతమ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-12-11T00:53:10+05:30 IST