అరుణాచలానికి ప్రత్యేక ఆర్టీసీ బస్సు
ABN , First Publish Date - 2023-10-13T00:48:58+05:30 IST
గన్నవరం ఆర్టీసీ డిపో నుంచి అరుణాచలం గిరి ప్రదక్షిణకు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ పి.శివాజీ గురువారం తెలిపారు.
గన్నవరం, అక్టోబరు 12: గన్నవరం ఆర్టీసీ డిపో నుంచి అరుణాచలం గిరి ప్రదక్షిణకు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ పి.శివాజీ గురువారం తెలిపారు. ఈనెల 27న మధ్యాహ్నం 2గంటలకు బస్సు బయలుదేరి 28వతేదీ ఉదయం శ్రీకాళహస్తి, కాణి పాకంలో దర్శనాలు అయ్యాక మధ్యాహ్నం శ్రీపురంలో మహాలక్షి అమ్మవారి దర్శనమయ్యాక, సాయంత్రం అరుణాచలం చేరుతుం దన్నారు. గిరి ప్రదక్షిణ, దర్శనం అనంతరం 29న ఉదయం బయలు దేరి కంచి దర్శనం, సాయంత్రం శ్రీకాళహస్తి చూసుకుని, అదే రోజు రాత్రికి బయలుదేరి 30వ తేదీ ఉదయం 8గంటలకు గన్నవరం చేరు కుంటుందన్నారు. సూపర్ లగ్జరీ బస్సులో 2+2 సీట్లు ఉంటాయని టికెట్ ధర రూ.3వేలు ఉంటుందని తెలిపారు. వివరాలకు 87909- 96090, 73829-05633 నెంబర్‌లను సంప్రదించాలని సూచించారు.