ఘనంగా కౌతవరం షిర్డీసాయి మందిరం 16వ వార్షికోత్సవం

ABN , First Publish Date - 2023-01-25T00:35:32+05:30 IST

కౌతవరం షిర్డీసాయి మందిరం 16వ వార్షికోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు.

 ఘనంగా కౌతవరం షిర్డీసాయి మందిరం 16వ వార్షికోత్సవం

గుడ్లవల్లేరు : కౌతవరం షిర్డీసాయి మందిరం 16వ వార్షికోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. బాబాకు మల్లికార్జున శర్మ అభిషేకాలు నిర్వహించారు. 3000 మంది భక్తులకు అన్నసమారాధన జరిపారు. అన్నసమారాధనను సంఘం చైర్మన్‌ కానూరి బాలకృష్ణ మోహన్‌(బాలు) ప్రారంభించారు. సమారాధనకు కోస్టల్‌ ఎంట్రప్రైజస్‌ ఫణీంద్ర రూ.50 వేలు, విశ్రాంత ప్రిన్సిపాల్‌ దాసరి హరిగోపాల్‌ రూ,25 వేలు, విశ్రాంత చీఫ్‌ ఎలక్ర్టికల్‌ ఇన్‌స్పెక్టర్‌ (తెలంగాణ) అడుసుమిల్లి రమణ ప్రసాద్‌ రూ.25 వేలు, కానూరి జగన్మోహనరావు 15 బస్తాల బియ్యం అందజేశారని బాలు తెలిపారు. పడమటి సుజాత, తూము ప్రమీలా రాణి, కళ్ళేపల్లి సుధారాణి, చాపరాల విజయలక్ష్మి, వడ్లమూడి సీతామహాలక్ష్మి, బొబ్బా జాన్సీ లక్ష్మి, బొబ్బా రంగనాయకమ్మ, కొల్లి నాన్‌జీ, రవీంద్ర పాల్గొన్నారు.

Updated Date - 2023-01-25T00:35:32+05:30 IST