Share News

శాంతి, కరుణ ఆచరణలో చూపాలి

ABN , Publish Date - Dec 26 , 2023 | 12:24 AM

సమస్త మానవాళికి ప్రేమతో కూడిన కరుణతో తోటి వారిపట్ల దయతో మెల గాలని క్రీస్తు భోధించిన శాంతిమార్గం ఆచరణలో చూపాలని టీడీపీ గన్నవరం ఇన్‌చార్జి యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. తిప్పనగుంటలోని ఐసీఎం చర్చి, సీఎస్‌ఐ చర్చిల్లో సోమవారం క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా జనసేన నియోజకవర్గ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్‌బాబుతో కలిసి ఆయన కేక్‌కట్‌ చేసి ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్నారు.

  శాంతి, కరుణ ఆచరణలో చూపాలి
తిప్పనగుంట చర్చిలో జరిగిన క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్న యార్లగడ్డ వెంకట్రావు

హనుమాన్‌జంక్షన్‌రూరల్‌, డిసెంబరు 25 : సమస్త మానవాళికి ప్రేమతో కూడిన కరుణతో తోటి వారిపట్ల దయతో మెల గాలని క్రీస్తు భోధించిన శాంతిమార్గం ఆచరణలో చూపాలని టీడీపీ గన్నవరం ఇన్‌చార్జి యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. తిప్పనగుంటలోని ఐసీఎం చర్చి, సీఎస్‌ఐ చర్చిల్లో సోమవారం క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా జనసేన నియోజకవర్గ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్‌బాబుతో కలిసి ఆయన కేక్‌కట్‌ చేసి ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్నారు. బైబిల్‌ వ్యాక్యాలు చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో సాయిలనాగేశ్వరరావు, కాకాని నాగేశ్వరరావు, దయాల రాజేశ్వర రావు, పుట్టా సురేష్‌, చిరుమామిళ్ల సూర్యం, దొంతు చిన్నా, మొవ్వా వెంకటేశ్వరరావు, వడ్డిల్లి లక్ష్మి, జనసేన మండల అధ్యక్షుడు వడ్డి శివనాగేశ్వరరావు, మాదాల శ్రీనివాసరావు, గుజ్జర్లమూడి బాబూరావు, అట్లూరి శ్రీనివాస్‌, మజ్జిగ నాగరాజు పాల్గొన్నారు.

హనుమాన్‌జంక్షన్‌ : క్రిస్మస్‌ పర్వదినం పురస్కరించుకొని ఆదివారం జంక్షన్‌లోని పలు చర్చిల్లో ప్రత్యేకప్రార్థనలు వేడుకగా నిర్వహించారు. పట్టణంలోని చర్చిలు విద్యుత్‌ దీపాలతో కొత్తశోభను సంతరించుకున్నాయి. నూజివీడు రోడ్డులోని కారుణ్య చర్చిలో ఫాదర్‌ రవిస్టాలిన్‌ స్వర్ణలత దంపతులు క్రిస్మస్‌ సందర్భంగా శనివారం రాత్రి కొవ్వొత్తులతో ప్రత్యేక ప్రార్ధనలు జరిపారు. ఆదివారం క్రీస్తు జననం పురస్కరిం చుకొని కేక్‌ కట్‌ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. హనుమాన్‌నగర్‌ హల్లెలూయ చర్చిలో ఫాదర్‌ శుభాకర్‌ ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. మాజీ జడ్పీటీసీ సభ్యులు సుంకర సుభాష్‌చంద్రబోస్‌ చర్చిలో పాల్గొన్న వృద్ధులకు దుప్పట్లు బాపులపాడు సర్పంచ్‌ సరిపల్లి కమలాకిరణ్‌ వైసీపీ క్రిస్టియన్‌ మైనార్టీ సెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కొమరవల్లి కిరణ్‌మూర్తి చేతులు మీదుగా పంపిణీ చేశారు. స్థానిక గుడివాడ రోడ్డలోని జ్యోతినగర్‌ ఆర్‌సీఎం చర్చిలో ఫాదర్‌ జోసెఫ్‌ తంబి ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. వృద్ధులకు పలువురు దాతలు దుప్పట్లు పంపిణీ చేశారు.

గన్నవరం : లోక రక్షకుడు జన్మించిన రోజే క్రిస్మస్‌ అని పాస్టర్‌ డేవిడ్‌ రాజు అన్నారు. మండలంలోని గ్రామాల్లో క్రిస్మస్‌ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. బీబీగూడెంలో పాస్టర్‌ డేవిడ్‌ రాజు ప్రసంగిస్తూ అందరికీ లోక రక్షకుడు యేసు క్రీస్తు అని చెప్పారు. ఆయన వచ్చిన తరువాతే లోకానికి వెలుగులు వచ్చాయన్నారు. అనంతరం వృద్ధులకు, వితంతువులకు దుస్తులు పంపిణీ చేశారు. అలాగే పురుషోత్తపట్నం మెస్సియ పెంతెకొస్తు చర్చిలో పాస్టర్‌ అన్నే సొలోమాను క్రీస్తు సందేశం అందించారు.

అందరూ సుఖసంతోషాలతో ఉండాలన్నదే తన ఆకాంక్ష అని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. గన్నవరం నియోజకవర్గంలో అందరి మహిళలకు దుస్తులు అంద జేస్తున్నామని సోమవారం తెలిపారు. మండలంలోని ఆయా గ్రామాల్లో టీడీపీ నాయకులు మహిళలకు దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తెలుగు మహిళ నియోజకవర్గ అధ్యక్షురాలు మేడేపల్లి రమాదేవి మాట్లాడుతూ, క్రీస్తు చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు. పేదల సంక్షేమానికి టీడీపీ విశేష కృషి చేస్తుందని చెప్పారు. శాంత, సుకన్య, రాజ్యలక్ష్మి, కార్తీక్‌, నితిన్‌, చింటూ, సిద్ధు తదితరులు పాల్గొన్నారు. గన్నవరంలో టీడీపీ టౌన్‌ అధ్యక్షుడు జాస్తి శ్రీధర్‌ చర్చిల్లో మహిళలకు దుస్తులు పంపిణీ చేశారు.

విజయవాడ రూరల్‌ : క్రిస్మస్‌ పండుగను పురస్కరించుకుని విజయవాడ రూరల్‌ గ్రామాల్లో గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో చీరల పంపిణీ సోమ వారం జరిగింది. ఆయా గ్రామాల్లో తెలుగుదేశం నేతలు స్ధానిక దళిత మహిళలకు చీరలను అందజేశారు. నున్నలో 1400 చీరలు, పాతపాడు, పి. నైనవరం, అంబాపురం గ్రామాలలో 1600 చీరలు మొత్తం 3000 చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గొడ్డళ్ల చిన్నరామారావు, కలకోటి శ్రీనివాసరెడ్డి, మాదు శివరామప్రసాద్‌, దండు సుబ్రహ్మణ్యంరాజు, గంపా శ్రీనివాస యాదవ్‌, మాదు మహేశ్వరరావు, యార్కారెడ్డి కోటిరెడ్డి, బేతపూడి మురళీ, పాతపాడు టీడీపీ నేతలు నల్లమోతు జీవన్‌రాజ్‌, బెజవాడ రామకోటయ్య, మల్లవల్లి వాసు, కోట చంటి తదితరులు పాల్గొన్నారు.

ఉయ్యూరు : రఏసుక్రీస్తు జన్మదినం క్రిస్మస్‌ పండుగను ఉయ్యూరు, మండల పరిధి గ్రామాల్లో సోమవారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా నూత న వస్ర్తాలు ధరించి ఉత్సాహంగా ఒకరికొకరు క్రిస్మస్‌ శుభా కాంక్షలు తెలుపుకున్నారు. వేకువజామున చర్చిలకు తరలివెళ్లి ప్రత్యేక ప్రార్ధనలో పాల్గొన్నారు. ఉయ్యూరు ఐలో బెన్నెట్‌ (సీబీఎం) చర్చిలో జరిగిన ప్రార్ధనల్లో ఎమ్మెల్యే కొలుసు పార్థసా రథి, రక్ష పౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ పడమట స్నిగ్ధ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చర్చిఫాదర్లు ప్రత్యేక ప్రార్ధన చేశారు. ఆర్సీఎం చర్చి, ఇతర చర్చిలలో జరిగిన ప్రార్ధనల్లో క్రైస్తవులుపాల్గొన్నారు. ఇమ్మా నుయేల్‌ చర్చిలో జరిగిన క్రిస్మస్‌ వేడుకలో ఎమ్మెలే సారథి, చర్చి ఫాదర్‌ డాక్టర్‌ జాన్‌ డేవిడ్‌, ఏజీ అండ్‌ ఎస్‌జీఎస్‌ జూని యర్‌ కళాశాల డైరెక్టర్‌ వినయ్‌కుమార్‌ పాల్గొని కేక్‌కట్‌చేసి ప్రార్ధనలో పాల్గొన్నారు.

Updated Date - Dec 26 , 2023 | 12:24 AM