Share News

సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం

ABN , Publish Date - Dec 24 , 2023 | 12:55 AM

అంగన్‌వాడీల సమస్యల పరిష్కరించటంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కళ్లం వెంకటేశ్వరరావు అన్నారు. స్థానిక ఐసీడీఎస్‌ కార్యాలయం వద్ద గడ్డితింటూ అంగన్‌ వాడీలు వినూత్నంగా శనివారం నిరసన తెలిపారు.

 సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం
గడ్డితింటూ నిరసన తెలుపుతున్న అంగన్వాడీలు

గన్నవరం, డిసెంబరు 23 : అంగన్‌వాడీల సమస్యల పరిష్కరించటంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కళ్లం వెంకటేశ్వరరావు అన్నారు. స్థానిక ఐసీడీఎస్‌ కార్యాలయం వద్ద గడ్డితింటూ అంగన్‌ వాడీలు వినూత్నంగా శనివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర రావు మాట్లాడుతూ 12 రోజులుగా సమస్యలు పరిష్కరించాలని అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలుపుతున్నా ప్రభుత్వానికి పట్టక పోవటం దారుణమన్నారు. జగన్‌రెడ్డికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. నాయకులు బేతా శ్రీనివాసరావు, రామరాజు, తాతబ్బాయి, మిరప నాగేశ్వరరరావు పాల్గొన్నారు.

Updated Date - Dec 24 , 2023 | 12:55 AM