Share News

Chandra Mohan: చంద్రమోహన్ స్వగ్రామం పమిడిముక్కలలో విషాదఛాయలు

ABN , First Publish Date - 2023-11-11T15:09:27+05:30 IST

Chandra Mohan: సినీ నటుడు చంద్రమోహన్ మరణంతో స్వగ్రామం పమిడి ముక్కలలో విషాద ఛాయలు అలముకున్నాయి. చంద్రమోహన్ మరణ వార్త తెలిసిన వెంటనే సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులు పమిడిముక్కల నుంచి హైదరాబాద్ బయలుదేరారు.

Chandra Mohan: చంద్రమోహన్ స్వగ్రామం పమిడిముక్కలలో విషాదఛాయలు

కృష్ణా: సినీ నటుడు చంద్రమోహన్ (Actor Chandramohan) మరణంతో స్వగ్రామం పమిడిముక్కలలో విషాద ఛాయలు అలముకున్నాయి. చంద్రమోహన్ మరణ వార్త తెలిసిన వెంటనే సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులు పమిడిముక్కల నుంచి హైదరాబాద్ బయలుదేరారు. 1942 మే 23న వీరభద్ర శాస్త్రి, శాంభవమ్మ దంపతులకు చంద్రమోహన్ 7వ సంతానం. పమిడిముక్కల మండలం మేడూరు హైస్కూల్లో ఎస్ఎస్సి పూర్తి చేసిన చంద్రమోహన్.. చదువుకున్న పాఠశాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. బాపట్లలో అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తి చేసి వ్యవసాయ శాఖలో మూడేళ్ల ఉద్యోగం చేశారు. ఆయన తొలి సినిమా రంగులరాట్నం కాగా.. ఇష్టమైన సినిమా బంగారు పిచ్చుక. చంద్రమోహన్ మృతి తమను కలిచివేసిందని సోదరుడు మల్లంపల్లి దుర్గాప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి సంక్రాంతికి స్వగ్రామం వచ్చి బంధువులు, గ్రామస్తులతో చంద్రమోహన్ ఆప్యాయంగా గడిపేవారని ఆయన గుర్తుచేశారు. చంద్రమోహన్‌ మరణం తమను షాక్‌కు గురిచేసిందని పమిడిముక్కల గ్రామస్తులు అన్నారు.

Updated Date - 2023-11-11T15:09:29+05:30 IST