రైతు సమస్యలపై ఉద్యమించాలి
ABN , First Publish Date - 2023-02-21T00:41:17+05:30 IST
అన్నదాత సమస్యలపై ఉద్యమించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వెలగపూడి ఆజాద్ పిలుపునిచ్చారు.
చల్లపల్లి, ఫిబ్రవరి 20 : అన్నదాత సమస్యలపై ఉద్యమించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వెలగపూడి ఆజాద్ పిలుపునిచ్చారు. రైతుసంఘం అవనిగడ్డ నియోజకవర్గ సమావేశం చండ్ర రాజేశ్వరరావు వికాసకేంద్రంలో సోమవారం జరిగింది రైతు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకూ కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు హనుమానుల సురేంద్రనాఽథ్ బెనర్జీ, నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు వేమూరి రత్నగిరిరావు, అట్లూరి వెంకటేశ్వరరావు, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి అడ్డాడ ప్రసాద్‌బాబు, కొండయ్య, పరుచూరి శ్రీనివాసరావు, మాలెంపాటి కాంచనరావు, పరుచూరి వెంకన్నబాబు, బండి రామకృష్ణ, కొర్రపాటి ముఖర్జీ, కోటేశ్వరరావు, శ్రీధర్, శ్రీనివాసరావు పాల్గొన్నారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.