2న అరుణాచలానికి ఆర్టీసీ బస్సు

ABN , First Publish Date - 2023-05-26T01:31:48+05:30 IST

గన్నవరం ఆర్టీసీ డిపో నుంచి అరుణాచలం గిరి ప్రదక్షిణకు ప్రత్యేక సూపర్‌ లగ్జరీ బస్సు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్‌ శివాజీ గురువారం తెలిపారు.

2న అరుణాచలానికి ఆర్టీసీ బస్సు

గన్నవరం, మే 25: గన్నవరం ఆర్టీసీ డిపో నుంచి అరుణాచలం గిరి ప్రదక్షిణకు ప్రత్యేక సూపర్‌ లగ్జరీ బస్సు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్‌ శివాజీ గురువారం తెలిపారు. జూన్‌ 2వ తేదీ రాత్రి 7గంటలకు డిపోలో బస్సు బయలుదేరి 3న ఉదయం శ్రీకాళహస్తి దర్శనం చేసుకుని మధ్యాహ్నం కాణిపాకం విఘ్నేశ్వరస్వామి ఆలయానికి చేరుకుంటుందని పేర్కొన్నారు. అక్కడ భోజనాలు చేశాక, సాయంత్రం శ్రీపురం గోల్డెన్‌ టెంపుల్‌ చేరుకుని అదే రోజు రాత్రి అరుణాచలం వెళుతుందన్నారు. 4వ తేదీ ఉదయం పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ, దర్శనం పూర్తయ్యాక సాయంత్రం బయల్దేరి 5వ తేదీ ఉదయానికి గన్నవరం చేరుకుంటుందన్నారు. టికెట్‌ ధర రూ.2700 అని, వివరాలకు 87909-96090, 73829-05633 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

Updated Date - 2023-05-26T01:31:48+05:30 IST