Share News

రోగులకు చిరునవ్వుతో సేవలందించాలి

ABN , Publish Date - Dec 31 , 2023 | 01:11 AM

రోగులకు చిరునవ్వుతో సేవలందిం చినప్పుడే ఆ రోగికి సగం రోగం నయం అవుతుందని హెల్త్‌ యూని వర్సిటీ రిజిస్ర్టార్‌ వి.రాధికారెడ్డి అన్నారు. మండలంలోని చిన అవు టపల్లి డాక్టర్స్‌ సుధా అండ్‌ నాగేశ్వ రరావు సిద్ధార్థ దంత వైద్య కళాశాల 14వ గ్రాడ్యుయేషన్‌ కాన్వోకేషన్‌ శనివారం ఘనంగా జరిగింది. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

 రోగులకు చిరునవ్వుతో సేవలందించాలి
విద్యార్థినికి డిగ్రీ ప్రదానం చేస్తున్న రిజిస్ర్టార్‌ డాక్టర్‌ రాధికారెడ్డి, డైరెక్టర్‌ జనరల్‌ నాగేశ్వరరావు

గన్నవరం, డిసెంబరు 30 : రోగులకు చిరునవ్వుతో సేవలందిం చినప్పుడే ఆ రోగికి సగం రోగం నయం అవుతుందని హెల్త్‌ యూని వర్సిటీ రిజిస్ర్టార్‌ వి.రాధికారెడ్డి అన్నారు. మండలంలోని చిన అవు టపల్లి డాక్టర్స్‌ సుధా అండ్‌ నాగేశ్వ రరావు సిద్ధార్థ దంత వైద్య కళాశాల 14వ గ్రాడ్యుయేషన్‌ కాన్వోకేషన్‌ శనివారం ఘనంగా జరిగింది. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎంవీ రామోజీరావు అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్‌ రాధికారెడ్డి మాట్లాడుతూ, ఉన్నతమైన సేవలందిస్తే గౌరవం, కీర్తి, సంతృప్తి లభిస్తుం దన్నారు. సిద్ధార్ధ అకాడమి అధ్యక్షులు డాక్టర్‌ చదలవాడ నాగేశ్వరరావు మాట్లాడుతూ, వైద్యు లు చేతులతో, మనస్సుతో, విజ్ఞానంతో సేవలందించాలన్నారు. కళాశాల కన్వీనర్‌ పాలడుగు నాగసాయి, మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ డి.రంగారావు, ఏవో వై.మధుసూదనరావు, హెచ్‌వోడీలు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Updated Date - Dec 31 , 2023 | 01:12 AM