పట్టాభి రామస్వామి ఆలయం పునఃప్రారంభం

ABN , First Publish Date - 2023-05-12T01:38:01+05:30 IST

దుర్గగడి దత్తత ఆలయంగా ఉ న్న గుంటూరు జిల్లా కొలనుకొండలోని పట్టాభిరామస్వా మి ఆలయ పునరుద్ధరణ తరువాత తొలిసారిగా పట్టాభిరామస్వామి ఆలయంలోకి భక్తులను అనుమతించారు.

పట్టాభి రామస్వామి ఆలయం పునఃప్రారంభం

వన్‌టౌన్‌, మే 11 : దుర్గగడి దత్తత ఆలయంగా ఉ న్న గుంటూరు జిల్లా కొలనుకొండలోని పట్టాభిరామస్వా మి ఆలయ పునరుద్ధరణ తరువాత తొలిసారిగా పట్టాభిరామస్వామి ఆలయంలోకి భక్తులను అనుమతించారు. ఈవో భ్రమరాంబ, ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌ కర్నాటి రాంబాబు దంపతులు, సభ్యులు కట్టా సత్తయ్య, చింకా శ్రీనివాసు లు, ఈఈ లింగం రమదేవి పాల్గొన్నారు. ఆలయంలో వై ఖానస ఆగమోక్తంగా పూజాదికాలను నిర్వహించారు. సీ తారాముడు, లక్ష్మణుడు, ఆంజనేయస్వామి విగ్రహాల ప్ర తిష్ఠ, ధ్వజ స్తంభ ప్రతిష్ఠ, పూర్ణాహుతి, శాంతికల్యాణం వంటి కార్యక్రమాలను ఆలయ విధి విధానాలతో నిర్వహించారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకుని సీతారామ స్మరణతో హోరెత్తించారు.

దుర్గగుడిలో అన్నదాన విభాగంలో తనిఖీ

ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌ కర్నాటి రాంబాబు గురువారం దుర్గగుడిలోని అన్నదాన విభాగాన్ని తనిఖీ చేశారు. అనంతరం రికార్డులను పరిశీలించి తగు సూచనలు చేశారు. భోజనశాలలో యాత్రికులను పలకరించి భోజన నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు.

Updated Date - 2023-05-12T01:38:01+05:30 IST