కోనేరులో ఆక్రమణల తొలగింపు

ABN , First Publish Date - 2023-06-04T00:33:11+05:30 IST

నందిగామ రామలింగేశ్వరస్వామి ఆలయానికి చెందిన కోనేరులో ఆక్రమణలను తొలగించారు.

కోనేరులో ఆక్రమణల తొలగింపు
కోనేరులో ఆక్రమణలు తొలగిస్తున్న అధికారులు

నందిగామ, జూన్‌ 3: నందిగామ రామలింగేశ్వరస్వామి ఆలయానికి చెందిన కోనేరులో ఆక్రమణలను తొలగించారు. దేవదాయశాఖ ట్రిబ్యునల్‌ ఆదేశాల మేరకు శనివారం దేవదాయ, రెవెన్యూ శాఖల అధికారులు ఈ చర్యలు చేపట్టారు. స్వామివారి కల్యాణం అనంతరం కోనేరులో దేవతామూర్తులు పడవలో విహరించే వారు. ఇందు కోసం 1.20 ఎకరాలను భూమిని కేటాయించారు. కాల క్రమేణ కోనేరు పూర్తిగా ఆక్రమణలకు గురైంది. పేద ప్రజలతోపాటు రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తులు కూడా కోనేరు ఆక్రమించి పెద్ద నిర్మాణాలు చేపట్టారు. ఈక్రమంలో ఆలయ ధర్మకర్తలు ఆక్రమణలపై ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. ఎట్టకేలకు కోనేరు ఆక్రమణలపై చర్యలు చేపట్టిన అధికారులు కోనేరు అభివృద్ధికి చర్యలు చేపట్టి స్వామివారి తెప్పోత్సవ కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలని భక్తులు కోరుతున్నారు.

Updated Date - 2023-06-04T00:33:11+05:30 IST