డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ర్యాలీ

ABN , First Publish Date - 2023-08-15T00:33:07+05:30 IST

డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కృష్ణాహోటల్‌ సెంటర్‌లో 77 జాతీయ జెండాలతో వివిధ కళారూపాలతో సోమవారం ర్యాలీని నిర్వహించారు.

డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ర్యాలీ
ర్యాలీలో పాల్గొన్న రామన్న

డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ర్యాలీ

అజిత్‌సింగ్‌నగర్‌, ఆగస్టు 14 : డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కృష్ణాహోటల్‌ సెంటర్‌లో 77 జాతీయ జెండాలతో వివిధ కళారూపాలతో సోమవారం ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి జి. రామన్న మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లు పూర్తవుతున్నా ప్రజల జీవన ప్రమాణాలు ఏ మాత్రం మారలేదన్నారు. ఓట్ల కోసం దేశాన్ని చీల్చేందుకు సైతం బీజేపీ వెనుకాడటం లేదని అందుకే నేడు యువత మతసామరస్యాన్ని, జాతీయ సమైక్యతనను కాపాడుకునేందుకు ప్రతిజ్ఞ పూనాలని పిలుపునిచ్చారు. నిజాముద్దీన్‌, శివ, రసూల్‌, దుర్గాప్రసాద్‌, పాల్గొన్నారు.

Updated Date - 2023-08-15T00:33:07+05:30 IST