మున్సిపల్ పారిశుధ్య కార్మికుల ర్యాలీ
ABN , Publish Date - Dec 23 , 2023 | 12:59 AM
నందిగామ మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం నందిగామ గాంధీ సెంటర్‌లో కార్మికులు మానవహారం నిర్వహించారు.
నందిగామ రూరల్, డిసెంబరు 22 : నందిగామ మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం నందిగామ గాంధీ సెంటర్‌లో కార్మికులు మానవహారం నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రదర్శనగా గాంధీసెంటర్‌కు చేరుకుని నిరసనలు తెలిపారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి. అజయ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ డిసెంబరు 26 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పారిశుఽధ్య కార్మికులు సమ్మె చేస్తున్నారన్నారు. పారిశుధ్య కార్మికులకు కనీస వేతనం రూ.26 ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో చనుమోలు సైదులు, కటారపు గోపాల్, పారిశుధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.